గర్భిణికి నొప్పులు రాకముందే సిజేరియన్ చేయించడం కరెక్టేనా.. అలా చేస్తే పుట్టే బిడ్డ‌ల‌ భ‌విష్యత్తు మారుతుందా..!

ప్రతీకాత్మక చిత్రం

గృహప్రవేశాలు.. పెళ్లిళ్లు.. శుభాకార్య‌లు.. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి ముందు ముహూర్తాలు చూసుకోవడం సహజం.. ఆ స‌మ‌యం ప్రకారం ప్రారంభోత్స‌వాలు నిర్వ‌హించుకుట్టారు.. కానీ ఈ మధ్య గ‌ర్బిణి స్త్రీ బిడ్డ‌కు జన్మనిచ్చే ముందు ముహూర్తం చూసుకొని బిడ్డలని కంటున్న‌ పరిస్థితి కనిపిస్తోంది. ఇలా చేయడం కరెక్టేనా.. తెలుసుకుందాం.

 • Share this:
  (P.Mahender,News18,Nizamabad)

  గృహప్రవేశాలు.. పెళ్లిళ్లు.. శుభాకార్య‌లు.. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి ముందు ముహూర్తాలు చూసుకోవడం సహజం.. ఆ స‌మ‌యం ప్రకారం ప్రారంభోత్స‌వాలు నిర్వ‌హించుకుట్టారు.. కానీ ఈ మధ్య గ‌ర్బిని స్త్రీ బిడ్డ‌కు జన్మనిచ్చే ముందు ముహూర్తం చూసుకొని బిడ్డల ని కంటున్న‌ పరిస్థితి కనిపిస్తోంది. ముహూర్తం పిచ్చిలో మ‌రి కొంద‌రు వారి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ మంది సిజేరియన్ కు మంచి సమయం ఉంద‌య‌ని పంతులు చెప్పారు.. ఆ సంయంలోనే మా అమ్మ‌యికి డెలీవ‌రి చేయాల‌ని ప‌ట్టు బ‌డుతున్నారు.. దీంతో వైద్యుల‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఓ వైద్యురాలు మనోగతం..

  Mutton: మటన్ కొనడానికి వెళ్తున్నారా.. అయితే అది ముదురుదా.. లేతదా అనేది ఇలా గుర్తుపట్టండి..


  కళ్యాణం వ‌చ్చినా.. క‌క్కొచ్చినా ఆగ‌దు అంటారు.. జ‌న‌న మ‌ర‌ణాలు మ‌న చేతిలో లేవు అని వాటికి ముహూర్తాలు ఉండ‌వ‌ని పెద్ద‌లు చెప్పేవారు.. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. మర‌ణాల సంగ‌తి ఏమోగాని.. జ‌న‌నాల విష‌యంలో మార్పు క‌నిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ఈ మ‌ధ్య కాలంలో గ‌ర్భిణులు పెట్టుడు ముహూర్తాల‌తో సిజేరియన్ వైపు చూస్తున్నారు.

  State Bank Of India: ఆ కస్టమర్ పోరాటానికి తలొగ్గిన ఎస్బీఐ.. ఇంతకు ఏం జరిగిందంటే..


  గ‌తంలో బిడ్డ పుట్టక అనేది దైవ‌నిర్ణం అనేవారు.. కానీ ఇప్పుడు దైవ‌నిర్ణ‌యాన్ని సైతం వారికి ఆనుకులంగా మార్చుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలు ముహూర్తాల పిచ్చితో డెలివరీ లకు వస్తున్నారని డాక్టర్ అరుణ గైనాకాల‌జీస్ట్ చెబుతున్నారు. తను 25 సంవత్సరాలుగా వైద్యవృత్తిలో కొనసాగుతున్నాను.. ఇప్పటి వరకు గృహప్రవేశాలు, పెళ్లిళ్లు , పేరంటాలు, పూజలు పురస్కారాలు చేసుకునేవారు ముహూర్త‌ాలు చూసేవారు.. అయితే ఈ మధ్యకాలంలో మంచి స‌మ‌యం చూసుకునేది ఓ ట్రెండ్ గా మారిపోయింది. వాస్తవానికి బిడ్డ ఇప్పుడు పుట్టాలనేది దైవ నిర్ణయం మా చేతీలో ఏమీ ఉండ‌దు.. బిడ్డ అడ్డం తిరిగిన‌ప్పుడు, ఆప‌రేష‌న్ చేయకపోతే బిడ్డ‌కు ప్రమాదం ఉన్న‌పుడు మాత్ర‌మే సిజేరియన్ చేస్తాం.

  Twitter Video Download: ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను ఎలా సేవ్ చేయాలి.. తెలుసుకోండి..


  లేదంటే స‌హ‌జంగా డెలివ‌రీ చేసేందుకు చూస్త‌ామ‌ని చెప్పారు.. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ముహూర్తం చూసుకొని బిడ్డ‌కు జన్మనిచ్చేందుకు సిద్ధమువుతున్నారు. ముహూర్త స‌మ‌యానికి డెలివ‌రీ చేయడంతో జన్మించే పిల్ల‌లు స‌రిగా ఎదగక ఆనారోగ్యానికి గురవుతున్నారు. కొంద‌రు వేకువజామున రెండు గంటలకు, మూడు గంటలకు ముహూర్తాలు పెట్టుకుని డాక్ట‌ర్స్ పై ఒత్తిడి తెస్తున్నారు.. ఆ స‌మ‌యంలో మేము నిద్రమత్తులో ఏదైనా జరిగితే దాన్ని భరించాల్సిన బాధ్యత ఎవరిది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బేబీ పూర్తిగా డెవలప్ కాకుండానే ముహూర్తం కారణంగా డెలివరీలు చేయాల్సి రావడంతో అనారోగ్యం బారిన పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

  Realme: దసరా బొనాంజా.. రియల్ మీ నుంచి మరికొన్ని స్మార్ట్ ప్రొడక్ట్స్ లాంచ్.. అవి ఏంటంటే..


  అయితే వారి మూఢనమ్మకాల కార‌ణంగా అర్ధరాత్రి , రాత్రి, పగలు అనే తేడా లేకుండా ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. పుట్టిన ముహూర్తం తో జీవితాలు మారిపోవడం అంటు ఎమీ ఉండ‌దు. వారి ప్ర‌వ‌ర్త‌న‌.. వారు ఎంచుకున్న ల‌క్ష్య‌లు.. ఏదైన సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మరికొందరు మా అమ్మాయి నొప్పికి తట్టుకోలేదు సిజేరియన్ చేయాల‌ని అడుగుతున్నారు. ప‌ది మందిలో తొమ్మ‌ిది మంది సిజేరియన్ వైపు మొగ్గుచుపుతున్నారని డాక్ట‌ర్ అరుణ వివ‌రించారు. సహజంగా డెలివరీ అయితేనే మహిళకు చాలా ఆరోగ్యం బాగుంటుంది. అత్య‌వ‌స‌రం అయితేనే సిజేరియన్ చేయాల‌ని అన్నారు.
  Published by:Veera Babu
  First published: