హోమ్ /వార్తలు /తెలంగాణ /

IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా

IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా

IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirupati Tour | ఐఆర్‌సీటీసీ తిరుపతికి హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కవర్ అవుతుంది.

  తిరుమల వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్‌లో తీసుకెళ్లి శ్రీవారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా చేస్తోంది. శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలకు కూడా తీసుకెళ్తుంది. 2021 మార్చి 5, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23 తేదీల్లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో బుకింగ్ చేయాల్సి ఉంటుంది.

  ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,820. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,920 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,600. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.

  IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి పూరీ, కోణార్క్ టూర్... ఐదు రోజులకు రూ.5,250 మాత్రమే

  తెలంగాణ, ఏపీ నుంచి IRCTC Bharat Darshan టూరిస్ట్ ట్రైన్... రూ.10,000 ఖర్చుతో 10 రోజుల టూర్

  IRCTC Tirupati Tour: ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే...


  Day 1: మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలో తిరుపతి చేరుకుంటారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు. సాయంత్రానికి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి.

  Day 2: రెండో రోజు తెల్లవారుజామున తిరుమల తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుపతి ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

  IRCTC Tirupathi Tour: భక్తులకు శుభవార్త... తిరుమలలో శ్రీవారి దర్శనంతో టూర్ ప్యాకేజీ

  IRCTC: స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

  నేరుగా తిరుపతి వచ్చేవారికి కూడా ఐఆర్‌సీటీకీ ఒకరోజు ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధర రూ.990 మాత్రమే. తిరుమల, తిరుచానూర్ ఆలయాలు దర్శించుకోవచ్చు. తిరుమల, తిరుచానూర్ ఆలయాల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. డివైన్ బాలాజీ దర్శన్ పేరుతో ఈ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌లో ఉంటుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Best tourist places, IRCTC, IRCTC Tourism, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tirumala, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati, Tourism

  ఉత్తమ కథలు