లాక్డౌన్ కారణంగా సుమారు 9 నెలల పాటు టూర్లు, షికార్లకు దూరమైన వారంతా ఇప్పుడు... సమయం దొరికితే ఎక్కడికైనా వెళ్లి సేదతీరేందుకు ఆలోచిస్తున్నారు. మరి మీరు కూడా ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. పూరీ, కోణార్క్, భువనేశ్వర్ లాంటి టూరిస్ట్ ప్రాంతాలు కవర్ అయ్యేలా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఐఆర్సీటీసీ జగన్నాథ్ ధామ్ యాత్ర పేరుతో ఈ ప్యాకేజీ లభిస్తుంది. 2021 మార్చి 5న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్లో ఈ టూర్ మొదలవుతుంది. ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ తో పాటు టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ ఆఫీస్, రీజనల్ ఆఫీసుల్లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్సీటీసీ జగన్నాథ్ ధామ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధర రూ.5,250 మాత్రమే. ఇది స్టాండర్డ్ ప్యాకేజీ ధర. ఒకవేళ కంఫర్ట్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే రూ.6,300 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో స్లీపర్ లేదా థర్డ్ ఏసీ క్లాస్ ప్రయాణం, బస ఏర్పాట్లు, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. తెలంగాణలోని సికింద్రాబాద్లో యాత్ర మొదలవుతుంది. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడలో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు.
తెలంగాణ, ఏపీ నుంచి IRCTC Bharat Darshan టూరిస్ట్ ట్రైన్... రూ.10,000 ఖర్చుతో 10 రోజుల టూర్
IRCTC Tirupathi Tour: భక్తులకు శుభవార్త... తిరుమలలో శ్రీవారి దర్శనంతో టూర్ ప్యాకేజీ
2021 March 5: మార్చి 5న అర్ధరాత్రి 12.05 గంటలకు సికింద్రాబాద్లో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు బయల్దేరుతుంది. అదే రోజు దారిలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడలో ఈ రైలు ఆగుతుంది. రాత్రికి పూరీ చేరుకుంటారు.
2021 March 6: మార్చి 6న ఉదయం పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కోణార్క్ తీసుకెళ్తారు. అక్కడ సూర్య దేవాలయాన్ని సందర్శించిన తర్వాత తిరిగి పూరీ చేరుకుంటారు. సాయంత్రం పూరీ బీచ్ చూడొచ్చు. రాత్రి భోజనం తర్వాత పూరీలోనే బస చేయాలి.
2021 March 7: మార్చి 7న ఉదయం భువనేశ్వర్ బయల్దేరాలి. భువనేశ్వర్ చేరుకున్నాక లింగరాజ ఆలయం సందర్శిస్తారు. ఆ తర్వాత లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి భువనేశ్వర్ నుంచి బయల్దేరాలి.
IRCTC: స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
IRCTC Kerala Tour: వైజాగ్ నుంచి కేరళకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
2021 March 8: మార్చి 8న భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ చేరుకుంటుంది.
2021 March 9: మార్చి 9న భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు నడిచే వేళల్లో మార్పులు ఉండొచ్చు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్యాకేజీ బుక్ చేసుకునే ప్రయాణికులు సంబంధిత అధికారులను రైలు టైమింగ్స్ వివరాలను అడిగి తెలుసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Best tourist places, IRCTC Tourism, Khammam, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tourism, Travel, Vijayawada, Visakhapatnam, Warangal