IRCTC Goa Tour: గోవాకు హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Goa Tour: గోవాకు హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Goa Tour | హైదరాబాద్ నుంచి గోవాకు ఫ్లైట్‌లో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    గోవా వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం గోవాకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఫ్లైట్‌లో గోవా తీసుకెళ్తుంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ మొదలవుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. గోవా డిలైట్ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీ అందిస్తోంది. నాలుగు రోజుల్లో గోవాలోని అందమైన బీచ్‌లు, టూరిస్ట్ స్పాట్స్, అరేబియన్ సముద్రం అందాలు చూడొచ్చు. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,270 మాత్రమే. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర ఇది. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.17,510 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.24,925. ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, మూడు రాత్రులు ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.

    IRCTC Goa Tour: ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ వివరాలివే...


    Day 1: మొదటి రోజు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 11:45 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1 గంటకు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. ఆ తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ రిలాక్స్ అయిన తర్వాత జువారీ రివర్, మోర్ముగావ్ హార్బర్ సందర్శించొచ్చు. రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

    IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా

    IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి పూరీ, కోణార్క్ టూర్... ఐదు రోజులకు రూ.5,250 మాత్రమే

    Day 2: రెండో రోజు దక్షిణ గోవా టూర్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్‌రైట్ గ్యాలరీ, బసిలికా ఆఫ్ బామ్ జీసస్, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశీ ఆలయం, మిరామర్ బీచ్ సందర్శించొచ్చు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి తిరిగి హోటల్‌కు చేరుకోవాలి.

    Day 3: మూడో రోజు నార్త్ గోవా టూర్ ఉంటుంది. అగువాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ సందర్శించొచ్చు. అక్కడ సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ఆ తరర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ సందర్శించొచ్చు. రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

    తెలంగాణ, ఏపీ నుంచి IRCTC Bharat Darshan టూరిస్ట్ ట్రైన్... రూ.10,000 ఖర్చుతో 10 రోజుల టూర్

    IRCTC Tirupathi Tour: భక్తులకు శుభవార్త... తిరుమలలో శ్రీవారి దర్శనంతో టూర్ ప్యాకేజీ

    Day 4: నాలుగో రోజు ఉదయం 11 గంటలకు హోటల్ నుంచి చెకౌట్ కావాలి. మధ్యాహ్నం 2 గంటలకు గోవాలో ఫ్లైట్ ఎక్కితే 3.20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

    హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ గోవా టూర్ మార్చి 6న ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేయాల్సి ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published: