Crime : లాక్‌డౌన్‌తో దోంగగా మారిన విదేశి వ్యాపారి.. హైదరాబాద్ పోలీసుల అరెస్ట్...

ప్రతీకాత్మక చిత్రం

Crime :లాక్‌డౌన్‌తో విదేశీ వ్యాపారులు దోంగలుగా మారారు. లాక్‌డౌన్‌లో వ్యాపారం కొనసాగకపోవడంతో ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు మకాం మార్చారు..దీంతో ఇతరులను మోసం చేసి డబ్బులు సంపాదించాలని భావించడంతో చివరికి పోలీసులకు పట్టుబడ్డారు.

  • Share this:
కరోనా అనేక మంది జీవితాలను నామారూపాలు లేకుండా చేస్తుంటే..చాలమంది కరోనా కొరల్లో పడి విలవిలాడుతున్నారు. ముఖ్యంగా కరోనాతో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడం..దీంతో రోజు వారి వ్యాపారుల జీవనం దుర్భరం అయింది..దీంతో పాటు చాలా వ్యాపారాలు,వ్యాపారస్తులు నష్టపోయారు. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి కావడంతో కోట్లాది మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు..
అయితే కరోనా ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని తమ జీవితాన్ని కొనసాగిస్తున్నావారు కోట్ల మందే ఉన్నారు..

అయితే ఢిల్లీకి చెందిన ఓ విదేశీ వ్యాపారీ మాత్రం లాక్‌డౌన్ కష్టాలను తట్టుకోలేక పోయాడు. వ్యాపారంలో నష్టాలను పూడ్చుకునేందుకు వక్రమార్గాన్నిపట్టాడు. తనతో పాటు మరో స్నేహితుడు కూడా తోడు కావడంతో ఆమాయకులను మోసం చేసి డబ్బు గుంజే పనిలో పడ్డారు..దీంతో హైదరాబాద్ పోలీసుల కంటపడి చివరకు కటకటాలపాలయ్యారు.

వివరాల్లోకి వెళితే..ఇరాన్‌కు చెందిన మహ్మద్ హుస్సెన్, వహిద్ రజబ్ గత ఆర్నెల్ల క్రితం టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చారు.ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో లభించే దుస్తులకు తమ దేశంలో మంచి డిమాండ్ ఉండడంతో వాటిని ఎగుమతి చేస్తూ.. డిల్లీలోనే మకాం వేశారు. ఇక వీరిందరికి స్థానికంగా ట్రాన్స్‌లేటర్‌గా పని చేస్తున్న ఇరాన్‌కు చెందిన నసీర్ అబిది తో ఫ్రెండ్‌షిప్ చేశారు.కాగా గత నెల రోజులుగా ఢిల్లీలో లాక్‌డౌన్ విధించడం విదేశాలకు వెళ్లేందుకు విమానాలు కూడ లేకపోవడంతో పాటు వ్యాపారం లేకపోవడంతో ఉన్న డబ్బులు అయిపోవడంతో ముగ్గురు కలిసి ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు మకాం మార్చారు. నగరంలోని లోని టోలిచౌకికి చేరుకున్నారు....చేతిలో డబ్బులు లేక పోవడంతో మోసాలకు పాల్పాడాలని నిర్ణయించుకున్నారు. తనకు తెలిసిన ప్రావీణ్యంతో మనుష్యులను మాయా చేసి డబ్బులు సంపాదించాలని భావించారు.

ముఖ్యంగా మహ్మద్ హుస్సెన్‌కు డబ్బులను లెక్కిస్తూ..చేతిలోనే డబ్బును మాయ చేయడం బాగా తెలుసు దీంతో దాన్నే తమ మోసానికి ప్రవృత్తిగా మార్చుకున్నారు..ఇలా ఎక్కడ డబ్బులు దొరుకుతాయా అన్వేషించారు. దీంతో మున్సురాబాద్‌లోని ఓ బియ్యం షాపుకు వెళ్లి తమ వద్ద డాలర్లు ఉన్నాయి..వాటిని ఇండియన్ రూపాయలుగా మార్చాలని చెప్పారు..అయితే యజమాని అందుకు అంగీకరించలేదు..దీంతో ఆ యజమానిని మాటల్లో పెట్టి క్యాష్ కౌంటర్‌లో నుండి ముప్పై వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. అనంతరం సాగర్ రింగ్‌ రోడ్డులో ఓ ఇంజిన్ ఆయిల్ షాపుకు వెళ్లి ఇదే ప్రయత్నం చేశారు. అక్కడ కూడ సాధ్యం కాకపోవడంతో.. ఆషాపుకు ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి వద్ద డబ్బులు లెక్కపెడుతామంటూ మొత్తం యాబై వేల రూపాయాల్లో 22వేల రూపాయలు మాయం చేశారు. అనంతరం అక్కడ నుండి పరారయ్యారు.

వరుస సంఘటనలతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటెజీల ఆధారంగా వారిని ట్రేస్ చేశారు. ఫుటేజీ ఆధారంగా వారిని టోలిచౌకిలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం వారి వద్ద 35 వేల రూపాయలతో పాటు 811 డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ పంపారు.
Published by:yveerash yveerash
First published: