IPS TRANSFERS IN TELANGANA AND CV ANAND IS CP OF HYDERABAD VRY HYD
TS IPS transfers : భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సివీ ఆనంద్..
హైదరాబాద్ సీపీగా సీవి ఆనంద్
TS IPS tranfers : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదీలీలు అయ్యాయి.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 మంది ఐపీఎస్ బదిలీ కాగా హైదరాబాద్ సీపీగా సీవి ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదీలీలు అయ్యాయి.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 మంది
ఐపీఎస్ బదిలీ కాగా హైదరాబాద్ సీపీగా సీవి ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల బదిలీ చేపట్టింది. బదిలీల్లో మొత్తం 31 మందికి వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. హైదరాబాద్ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ను ఏసీపీ డీజీగా ప్రమోషన్ కల్పించారు. కాగా గత కొ్ద్ది కాలంగా ఢిల్లీ కేడర్‌లో కొనసాగుతూ ఇటివలే హైదరాబాద్‌కు వచ్చిన సీవి అనంద్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.మరోవైపు అడిషనల్ సీపీ శిఖా గోయల్‌ను ఏసిబి డైరక్టర్ గా నియమించారు. ఇక పోస్టింగ్ కోసం వేచి ఉన్న రమారాజేశ్వరిని నల్గోండ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా ఎస్పీగా ఉన్న ఎన్. స్వేతను సిద్దిపేట జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. సిద్దిపేట ఎస్పీగా ఉన్న జోయల్ డెవీస్ను హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపిగా బదిలీ చేశారు. క్రైమ్ డీసిపి రోహిణి ప్రియదర్శిని మెదక్ ఎస్పీగా బదిలీ అయ్యారు. మెదక్ ఎస్పీగా ఉన్న చందనా దీప్తీకి సైబరాబాద్ క్రైం డీసిపిగా పోస్టింగ్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.