Home /News /telangana /

IPL BETTING IS ON THE RISE EVERYWHERE THOSE APPS THAT ARE OVERFLOWING IN BETTINGS KMM VB

IPL Bettings: సిక్సా.. ఫట్టా.. నగరంలో జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌ లు.. కొంపముంచుతున్న ఆ యాప్ లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IPL Bettings: ఈజీ మనికీ అలవాటు పడిన యువత మత్తులో జోగుతోంది. చదువు, కెరీర్‌, ఆర్థిక ఉన్నతి, కుటుంబ బాధ్యతలు ఏవీ లేకుండా వ్యసనాలకు లోనైపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కార్యకలాపంలో నిమగ్నం అవుతూ.. లక్ష్యాన్ని మరుస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ కావడంతో ఇప్పుడు తాజాగా ఎక్కడ చూసినా బెట్టింగ్‌ నడుస్తోంది.

ఇంకా చదవండి ...
  (G.SrinivasReddy,News18,Khammam) 

  ఈజీ మనికీ(Easy Money) అలవాటు పడిన యువత మత్తులో జోగుతోంది. చదువు, కెరీర్‌, ఆర్థిక ఉన్నతి, కుటుంబ బాధ్యతలు ఏవీ లేకుండా వ్యసనాలకు లోనైపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కార్యకలాపంలో నిమగ్నం అవుతూ.. లక్ష్యాన్ని మరుస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ (IPL Season) కావడంతో ఇప్పుడు తాజాగా ఎక్కడ చూసినా బెట్టింగ్‌ నడుస్తోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ యాప్‌ ల ద్వారా బెట్టింగ్‌ రాకెట్ల వలలో చిక్కుకుంటున్నారు. ఉన్నవి కాస్త పోయినా ఆగకుండా అప్పులు చూసి మరీ బెట్టింగ్‌లకు దిగుతున్నారు. దీంతో ఉన్నది పోయి అప్పు తెచ్చినది కూడా పోయి ఇంట్లో వాళ్లకు ముఖం చూపలేని దుస్థితిలో చిక్కుకుంటున్నారు. ఇవి ఎక్కడిదాకా దారితీస్తున్నాయంటే కొన్ని కొన్ని సార్లు ఈ దుస్థితి నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. వారి కుటుంబాలకు, తల్లిదండ్రులకు వేదన మిగులుస్తున్నారు.

  అతడి హోదా కానిస్టేబుల్.. కేసు వివరాల కోసం అంటూ వెళ్లాడు.. మైనర్ బాలికపై కన్నేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


  మ్యాచ్‌ ఎవరు గెలుస్తారు..? ఈ బాల్‌ కు ఎన్ని రన్స్‌ వస్తాయి..? అవుటా.. సిక్సా.. వికెట్‌ పడుతుందా..? ఇలా ప్రతి దానికి టోకుగా.. చిల్లరగా బెట్టింగ్‌ నడుస్తోంది. దీనికసం కొందరు గ్యాంగ్‌లుగా ఏర్పాటై బెట్టింగ్‌ రాకెట్‌ను నడిపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్థిక పరిపుష్టి ఉన్న సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలకు తోడు ఖమ్మంలోనూ ఈ బెట్టింగ్‌ రాకెట్‌ పడగవిప్పింది. యువతలో ఒకరి నుంచి ఒకరికి ఈ బెట్టింగ్‌ అలవాటు పాకుతోంది. పైగా ప్రస్తుతం రకరకాల యాప్స్‌ అందుబాటులోకి రావడంతో ఎవరు బెట్టింగ్‌లో పాల్గొంటున్నారో అర్థం కాని పరిస్థితి.

  అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు.. గ్రామస్తులు వాళ్లకు సమాజం తలదించుకునే శిక్ష వేశారు.. ఏంటంటే..


  దీంతో చట్టానికి దొరక్కుండా వీళ్లు సెక్యూర్డ్‌గా తమ పనికానిచ్చేస్తున్నారు. కొన్ని సార్లు బెట్టింగ్‌లో సొమ్ములు వచ్చినా అంతిమంగా పోయేదే ఎక్కువ. ఫలితంగా అప్పుల పాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ యాప్‌లకు తోడు అక్కడక్కడా కమిషన్లకు ఆశపడిన మధ్యవర్తులు తోడై వీరిని అప్పులిచ్చి మరీ ఆకర్షిస్తున్నారు. ఫలితంగా నష్టం జరిగాక తెలిసినా తమ పిల్లాడు చేతికిరాకుండా పోతున్నాడన్న వేదన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఇలా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నిత్యం కొన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.

  Business Ideas: బిజినెస్ చేయాలనుకునే వారు ఈ ఐడియాలను తెలుసుకోండి.. నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష సంపాదించొచ్చు..


  అమ్మానాన్నలు ఇచ్చిన పాకెట్‌ మనీకి తోడు ఇంకా కాస్త అప్పు తెచ్చి మరీ బెట్గింగ్‌లో పెడుతున్నారు. అంతిమంగా అప్పుల పాలై జీవితాలను దుర్భరంగా మార్చుకుంటున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా ఏర్పాటు చేసుకున్నా ఆన్‌లైన్‌లో ఉన్న ఈ బెట్టింగ్‌ యాప్‌లను డీకోడ్‌ చేయడం.. వారి కార్యకలాపాలను ఆధారాలతో సహా పట్టుకోవడం సాధ్యం కాని పరిస్థితి. దీంతో రోజురోజుకూ ఈ బెట్టింగ్‌ మాఫియా రెక్కలు విరుచుకుని వేగంగా విస్తరిస్తోంది. పైగా దేశీయంగా జరిగే మ్యాచ్‌లకు తోడు విదేశాల్లో నిర్వహించే చిన్నచిన్నన టోర్నమెంట్స్‌లలోనూ ఈ బెట్టింగ్‌ సాధారణంగా మారింది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Betting, IPL 2021, Khammam

  తదుపరి వార్తలు