Telangana: ఆశా వర్కర్లకు ఐఫోన్లు..ANMలకు ఐపాడ్లు.. మంత్రివర్గ ఉపసంఘం కీలక సూచనలు

మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టి తక్షణమే చక్కదిద్దాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచించింది. కొన్ని చోట్ల అవసరం లేకున్నా వైద్యశాలలు ఉన్నాయని.. వాటిని అవసరమున్న మరోచోటుకు తరలించాలని అభిప్రాయపడింది.

 • Share this:
  ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచించింది. వార్డులు, మరుగుదొడ్లు, స్నానాల గదులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంత నాణ్యమైన భోజనం పెట్టినా.. పక్క నుంచి దుర్వాసన వస్తుంటే, ఎలా తినగలరని అభిప్రాయపడింది. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యాన్ని అత్యంత ప్రాధాన్యమైన అంశంగా పరిగణించాలని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వార్డులు, మరుగు దొడ్లు, స్నానాల గదులను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపింది. మెడికల్ కాలేజీల్లో వైద్యులు సమయపాలన పాటించకపోడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని విధిగా అమలుచేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో వైద్యసేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో భద్రపర్చాలని.. ఇందుకోసం ఆశాలకు ఐఫోన్లు, ఏఎన్‌ఎంలకు ఐప్యాడ్‌లు అందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

  రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపర్చేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. గురువారం బీఆర్‌కే భవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ ఆరోగ్యవర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం పేషీ ఓఎస్డీ డాక్టర్‌ టి.గంగాధర్‌ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


  ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టి తక్షణమే చక్కదిద్దాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచించింది. కొన్ని చోట్ల అవసరం లేకున్నా వైద్యశాలలు ఉన్నాయని.. వాటిని అవసరమున్న మరోచోటుకు తరలించాలని అభిప్రాయపడింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వైద్య సేవలను పరిశీలించాలి. వాటిని మన రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలి. వైద్యశాఖలో పనిచేసే ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలను చెల్లించాలని సూచించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజేరియన్, అబార్షన్‌లను అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. కాన్పు కోతలు, గర్భసంచి కోతలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో సమగ్ర ఆరోగ్య సర్వే పైలట్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించింది.

  తెలంగాణలో ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, అధునాతన వైద్య పరికరాలను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గాంధీ ఆస్పత్రితో పాటు వరంగల్ ఎంజీఎంను స్వయంగా సందర్శించారు. అక్కడున్న సదుపాయాలు, వైద్య చికిత్సల తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతోనూ స్వయంగా మాట్లాడారు. ఇక పేదలకు వైద్య ఖర్చులు భారం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లను కూడా ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం వివరాలు నమోదు చేసేందుకు ప్రజారోగ్య సర్వే నిర్వహించనున్నారు. మొదట ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనుంది.
  Published by:Shiva Kumar Addula
  First published: