తెలంగాణలో కొన్ని చోట్ల ఇంటర్నెట్ బంద్..

తెలంగాణలో కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ను ఆపేశారు. నిన్న రాత్రి భైంసాలో చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: January 13, 2020, 4:19 PM IST
తెలంగాణలో కొన్ని చోట్ల ఇంటర్నెట్ బంద్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ను ఆపేశారు. నిన్న రాత్రి భైంసాలో చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. రాత్రి జరిగిన ఈ ఘటనలో 11 మంది గాయపడ్డట్లు తెలిసింది. కొన్ని వాహనాలను తగులబెట్టి, ఇళ్లపై కొందరు దాడిచేశారు. దీని ప్రభావంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తి తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని, ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. అంతేకాదు.. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.

ఈ నెల 16వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ కాబోవని టెలికం సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

మంచిర్యాలలో కొందరు వినియోగదారులకు వచ్చిన సందేశం


First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading