Home /News /telangana /

INTERNATIONAL WOMENS DAY SUCCESS STORY OF TRIBAL GIRL FROM WATER RAPPELLING SPORT BA

WomensDay 2020 | సాహసం శ్వాసగా సాగిపోతున్న ఆదివాసీ అమ్మాయి...

మడావి కన్నీబాయి

మడావి కన్నీబాయి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని భీమన్ గొందికి చెందిన మడావి కన్నీబాయి సాహస కృత్యాలకు చిరునామాగా నిలిచింది.

    మంచు కొండల్ని, జలపాతాన్ని అవలీలగా అధిరోహించి ఔరా అనిపిస్తోంది ఆ ఆదివాసీ యువతి. పతకాలను, ప్రశంసలను అందుకుంటూ సాహస కృత్యాలకు చిరునామాగా నిలుస్తున్న ఆ ఆదివాసీ యువతిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూస్‌18 ప్రత్యేక కథనం. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని భీమన్ గొందికి చెందిన మడావి కన్నీబాయి సాహస కృత్యాలకు చిరునామాగా నిలిచింది. మారుమూల గిరిజన గూడేనికి చెందిన ఈ కోలామ్ యువతి ఇటీవల కటిక జలపాతంలో జరిగిన ప్రపంచ స్థాయి వాటర్ రాఫెల్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని గెలుచుకుంది. 18 దేశాలతో పోటీ పడి కళ్ళకు గంతలు కట్టుకొని జలపాతం ఎక్కడం దిగడంతో బంగారు పతకాన్ని సాధించింది. గతంలో కన్నీబాయి ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న భగీరథ 2 పర్వతాన్ని అధిరోహించింది. ఈ పర్వతం ఎత్తు 6,512 మీటర్లు. ఇలా సాహస కృత్యాల్లో పాల్గొంటూ ప్రతిభను కనబరిచి పతకాలను సాధించిన ఈ కోలామ్ గిరిజన యువతిని తెలంగాణ సాహస క్రీడలకు అంబాసిడర్ ప్రకటించారు.

    (కట్టా లెనిన్, న్యూస్‌18 కరస్పాండెంట్) 

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Telangana, Womens Day 2020

    తదుపరి వార్తలు