అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగినులకు తెలంగాణ ప్రభుత్వం కానుకను ప్రకటించింది. ఇవాళ వారందరికి స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. ఇది అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తిస్తుందని తెలిపింది. సెలవునకు సంబంధించి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న కండక్టర్లు, ఉద్యోగినులకు సీ-ఆఫ్ (కాంపెన్సేటరీ ఆఫ్)ను ప్రకటించారు. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. స్పెషల్ ఆఫ్ వర్తించేవారికి కూడా సీ-ఆఫ్ వర్తింపజేస్తామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, పురుషులతో సమానంగా ఆర్టీసీలోనూ దూసుకెళ్లాలని ఈ సందర్భంగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, సునీల్ శర్మ కోరారు. ఏదీ ఏమైనా ప్రభుత్వం అందించిన ఈ సెలవు కానుకతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.