Home /News /telangana /

INTERNATIONAL WOMENS DAY 2021 TELANGANA CM KCR WISHES WOMEN AND ANNOUNCES HOLIDAY ON MARCH 8 SK

Womens Day 2021: నేడు సెలవు.. మహిళలకు సీఎం కేసీఆర్ కానుక

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

International Womens Day: మహిళల భద్రతకు షీ టీమ్స్, వృద్ధ, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, KCR KIT అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు

ఇంకా చదవండి ...
    నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళంందరికీ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని ఆయన అన్నారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళ తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారని కొనియాడారు. మహిళలకు అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8, 2021 న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ కు సీఎం ఆదేశాలు ఇచ్చారు.


    మహిళ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టిందని సీఎం కేసీఆర్ వివరించారు. మహిళల భద్రతకు షీ టీమ్స్, వృద్ధ, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, KCR KIT అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో ఉన్నదని ఈ సందర్భంగా వెల్లడించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Telangana, Women's day, Womens day 2021

    తదుపరి వార్తలు