• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • INTERNATIONAL KITE FESTIVAL 2020 TO BE HELD HYDERABAD FROM TODAY NK

హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్... నేటి నుంచీ మూడు రోజులు సందడే సందడి...

హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్... నేటి నుంచీ మూడు రోజులు సందడే సందడి...

13 నుంచీ హైదరాబాద్ కైట్ ఫెస్టివల్... ఇవీ ప్రత్యేకతలు...

గాలిపటాలు తెచ్చామా... ఎగరేశామా... వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా... ఈసారి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో కొత్తదనం చూపించబోతున్నారు.

  • Share this:
    హైదరాబాద్‌లో ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ బాగా జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా దీన్ని అద్భుతంగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకూ మూడ్రోజులపాటూ... ఈ ఫెస్టివల్‌ను సికింద్రాబాద్... పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించబోతున్నారు. ఇందులో 25 రాష్ట్రాలకు చెందిన 60 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్లు, 20 దేశాల నుంచీ 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు... తమ భారీ, విచిత్రమైన ఆకారాల్లో కనిపించే పతంగుల్ని ఎగరేయబోతున్నారు. అంతేకాదు... అక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక స్టాళ్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన... హైదరాబాద్‌లో నివసిస్తున్న మహిళలు... తమ ఇళ్లలో తయారుచేసే స్వీట్లను అమ్మబోతున్నారు. అదే సమయంలో తెలంగాణలో ఆడే సంప్రదాయ ఆటపాటల్ని కూడా ఈ వేడుకల్లో ప్రదర్శించబోతున్నారు. ప్రస్తుతానికి ఈ వేడుక జరిగేది మూడ్రోజులే అయినా... భవిష్యత్తులో దీన్ని వారం పాటూ జరిపేలా ప్లాన్ ఉంది ప్రభుత్వం దగ్గర. ఫెస్టివల్ జరిగేందుకు ఇంకా ఒక్క రోజే టైమ్ ఉంది కదా. అందుకే... పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వంటలు, స్వీట్లు, షాపింగ్, పార్కింగ్ అన్నింటికీ సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

    కైట్ ఫెస్టివల్ సందర్భంగా... సికింద్రాబాద్‌లోని జింఖానా స్టేడియంలో... రాష్ట్రస్థాయి పోటీలు జరగబోతున్నాయి. వాటిలో పాల్గొనే వారికి జింఖానా స్టేడియంలోనే జిల్లా స్థాయి సెలెక్షన్స్‌ను నిర్వహించారు.  18 ఏళ్లు మించని టీనేజ్ కుర్రాళ్లకు... బొంగరం, గిల్లిదండ..., బాలికలకు తొక్కుడు బిళ్ల, అష్టాచెమ్మ, యువకులకు సాక్‌రేస్‌, మ్యూజికల్‌చైర్‌, లెమన్‌ అండ్‌ స్పూన్‌రేస్‌ (18 ఏండ్లు నిండిన వారికి), 12 ఏళ్ల వారికి త్రిలెగ్‌రేస్‌, 16 ఏళ్ల కంటే తక్కువ గల వారికి గోఠీలు, అమ్మాయిలకు ఇసుర్రాయి గ్రైండింగ్‌ పోటీలను నిర్వహించబోతున్నారు. ఇలా హైదరాబాద్‌లో సంక్రాంతి సందడిగా సాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

    ఏటా సంక్రాంతి టైమ్‌లో ఈ వేడుక జరుపుతుండటంతో... ఏపీకి చెందిన చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోతుండటంతో... దీన్ని మిస్సవుతున్నారు. చాలా ఫీలవుతున్నారు. అలాంటి వాళ్లు కూడా చూడాలంటే... వారంపాటూ ఈ వేడుకల్ని నిర్వహించడం కరెక్టన్న వాదన వినిపిస్తోంది. వారం అయితే... సొంతూళ్లకు వెళ్లి తిరిగొచ్చేసి... వెంటనే ఈ ఫెస్టివల్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది.
    Published by:Krishna Kumar N
    First published: