Home /News /telangana /

INTERNATIONAL CYBER GANG ARREST WHO FRAUD ABOUT 50 CRORE BY CYBERABAD POLICE VRY

Cyber gang arrest : 50 కోట్ల సైబర్ ఫ్రాడ్... అంతర్జాతీయ ముఠా అరెస్ట్.. ఎలా మోసం చేశారంటే....?

stephen ravindra

stephen ravindra

Cyber gang arrest : విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డులే లక్ష్యంగా క్లోనింగ్‌ మోసాలకు పాల్పడుతున్నఅంతర్జాతీయ సైబర్ ముఠాను సైబారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.. కాగా ఈ ముఠా ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్టు సమాచారం..

ఇంకా చదవండి ...
    విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డులే లక్ష్యంగా క్లోనింగ్‌ మోసాలకు పాల్పడుతున్నఅంతర్జాతీయ సైబర్ ముఠాను సైబారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.. కాగా ఈ ముఠా ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్టు సమాచారం..

    విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డులే లక్ష్యంగా క్లోనింగ్‌ మోసాలకు పాల్పడుతున్నఅంతర్జాతీయ సైబర్ ముఠాను సైబారాబాద్ పోలీసులు వల పన్ని పట్టుకున్నారు.. సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర అరెస్ట్‌కు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు.

    బ్యాంకు వినియోగదారులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా ఒకటి క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, పూర్తి వివరాలు ఇస్తే వెంటనే యాక్టివేట్ చేస్తామని చెబుతుంటారు.. ఆ తర్వాత ఆ వివరాలతో ఆయా కార్డులను క్లోనింగ్ చేసి..ఆన్ లైన్ ద్వారా విదేశాల్లో ఆ కార్డులను విక్రయిస్తున్నారు.

    Constable remand : మహిళా కానిస్టేబుల్‌‌తో క్లోజ్.. రెండు సార్లు గర్భం చేసి.. ఆ తర్వాత..!

    ఇలా ఎక్కువగా విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డులే లక్ష్యంగా వీరు మోసాలకు పాల్పడ్డారు. వీరి మోసాలలో ముఖ్యంగా విదేశీ క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఫ్రాంచైజ్ గా ఉన్న పలు భారతీయ బ్యాంక్ లకు ఈ గ్యాంగ్ టోకరా వేసినట్లు పోలీసులు గుర్తించారు.

    UP Elections : ఆమె కూతురు బీజేపీ ఎమ్మెల్యే చేతిలో రేప్‌కు గురైంది..! బాధితురాలి తల్లికి, ఇలా అవకాశం కల్పించింది కాంగ్రేస్ పార్టీ..

    ఈ క్రమంలోనే భారత్ లో 80 మందితో కాల్ సెంటర్ నిర్వహిస్తుంది.. కాగా ఈ ముఠాకు.. దుబాయ్ లో ఉన్న మరో రెండు ముఠాలు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా నిర్వహిస్తున్న కాల్ సెంటర్ పై పోలీసులు జరిపిన దాడుల్లో 1 కోటి 11 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఠాకి చెందిన నవీన్ బొటాని అనే కీలక సూత్రధారిని అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కాగా ఈ ముఠా ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడినట్టు ఆయన వెల్లడించారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CYBER CRIME, Cyberabad crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు