Home /News /telangana /

INTERESTING DETAILS ABOUT MODI PRAISED HYDERABADI DHRUVA SPACE STARTUP PCV BK

Start Up: మోడీ మెచ్చుకున్న హైదరాబాద్ స్టార్టప్.. వాళ్లేం తయారు చేస్తున్నారో తెలిస్తే షాక్

  Start Up : హైదరాబాద్ లో తయారు కాని వస్తువు లేదని మరోసారి నిరూపించారు నగరానికి చెందిన యువత. గుండు పిన్ను నుంచి ఆకాశంలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహాల వరకు మన నగరంలోనే తయారు అవుతున్నాయి ప్రస్తుతం. అందుకే ప్రధాని మోడీ కూడా తన మన్ కీ బాత్ లో మన నగరానికి చెందిన వాణిజ్య అవసరాలు తీర్చే ఉపగ్రహాలు తయారు చేసే స్టార్టప్ గురించి కొనియాడారు.

  ప్ర‌స్తుత అవ‌స‌రాలు తీర్చ‌డానికి అవ‌స‌ర‌మైన ఉప‌గ్ర‌హాల‌ను త‌యారు చేసి వాటి స్పేస్ క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెడుతున్నారు హైద‌రాబాద్  కు చెందిన యువ‌త‌. మీరు ఎదైనా ఉప‌గ్ర‌హాన్ని పైకి పంపించాల‌నుకుంటే వీళ్ల‌కు ఒక్క మాట చెబితే చాలు ఆ ప‌ని చేసి పెడ‌తారు.  దేశంలో మొట్ట‌మొద‌టి ఉప‌గ్ర‌హాలు త‌యారు చేసే స్టార్టప్ ను మ‌న న‌గ‌రం నుంచి న‌డుపుతున్నారు హైద‌రాబాద్ కు చెందిన యువ బృందం సంజయ్ నెక్కంటి, చైతన్య దొర, రాహుల్ రవి కుమార్, విశాల్ లత బాలకుమార్, అభయ్ ఏగూర్ మరియు కృష్ణ తేజ.  'స్పేస్' కేటగిరీలో ఇటీవల నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2020 గెలుచుకుంది వీళ్లు స్థాపించిన‌ ధృవ స్పేస్ స్టార్టప్.

  ప్ర‌స్తుతం తెలంగాణలో ఉపగ్రహాల తయారీ కోసం భారీ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ (AIT) సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఈ యువ బృందం. అంతర్జాతీయ స్పేస్-టెక్ ఇండ‌స్ట్రీలో ధృవ స్పేస్ కొత్త‌దేమి కాదు.  అయిన‌ప్ప‌టికి వ్యాపార అవ‌స‌రాలు తీర్చ‌డానికి చిన్న ఉపగ్రహ వ్యవస్థలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది.

  2012లో ప్రారంభమైన ఈ కంపెనీకి CEO సంజయ్ నెక్కంటి నాయకత్వం వహిస్తున్నారు. ఇత‌నితో పాటు చైతన్య దొర, రాహుల్ రవి కుమార్, విశాల్ లత బాలకుమార్, అభయ్ ఏగూర్ , కృష్ణ తేజ బొర్డు స‌భ్యులుగా ఉన్నారు.  ఏడాదికి దాదాపు 300 ఉపగ్రహాలను తయారు చేయగల సామర్థ్యంతో ధృవ స్కేల్‌లో శాటిలైట్‌లను తయారు చేయాలని యోచిస్తోంది.

  "ఉపగ్రహాలు, అండ్ గ్రౌండ్ స్టేషన్ పై దృష్టి సారించిన పూర్తి స్టాక్ స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్' కంపెనీని ఏర్పాటు చేశాం. ప్ర‌స్తుతం 200-250 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలు త‌యారు చేసే సామ‌ర్ధ్యం మాకు ఉంది కేవ‌లం ఉప‌గ్ర‌హాల‌ను త‌యారు చేయ‌డ‌మే కాకుండా వాటిని క‌క్ష్య‌లోకి కూడా తీసుకెళ్లే బాధ్య‌త మేమే తీసుకుంటాం" అని కంపెనీకి CEO సంజయ్ నెక్కంటి తెలిపారు.

  స్థాపించిన కొద్ది రోజుల్లోనే  ఆస్ట్రియా.. వియన్నాలోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇంక్యుబేషన్ కోసం ఆహ్వానించింది. “మ‌న దేశంతో పాటు ఇత‌ర దేశ‌లైన‌, యూరప్‌, ఉత్తర అమెరికాలో నుంచి కూడా మాకు మంచి అవ‌కాశాలు వ‌స్తోన్నాయి. చిన్న ఉపగ్రహ సాంకేతికత త‌యార‌రిలో మేము ప్రారంభించిన ఈ స్టార్టప్ అనేది మొట్ట‌మొద‌టిది. ఇస్రో నుండి మాకు ఎల్లప్పుడూ మంచి మద్దతు లభిస్తోంది, ఇది మాకు కొత్త ఉప‌గ్ర‌హాలు త‌యారు చేయడంలో సహాయపడుతుంది" తెలిపారు సంజ‌య్.

  చిన్న పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తున్న చెన్నై మరియు హైదరాబాద్‌కు చెందిన అగ్నికుల్ మరియు స్కైరూట్ అనే రెండు స్టార్టప్‌ల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీని ద్వారా అంతరిక్ష ప్రయోగానికి అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అంచనా. శాటిలైట్ డిప్లోయర్లు, ఉపగ్రహాల కోసం హై-టెక్నాలజీ సోలార్ ప్యానెల్స్‌పై పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ధృవ స్పేస్ గురించి ఆయన ప్రస్తావిండం విశేషం. జూన్ 30న ప్రయోగించాల్సిన PSLV-C53 యొక్క PSLV ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)లో దృవ స్పేస్ సెంట‌ర్ త‌యారు చేసిన ఉప‌గ్ర‌హాలు స్పేస్ లోకి ఎగ‌ర‌నున్నాయి.
  Published by:V. Parameshawara Chary
  First published:

  Tags: Hyderabad, Narendra modi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు