(పి.మహేందర్, న్యూస్ 18-తెలుగు ప్రతినిధి, నిజామాబాద్ జిల్లా)
ఇంటి అవసరాల కొసం తాగునీరు తీసుకువచ్చేందుకు తల్లితో కలిసి ఇంటర్ విద్యార్ధిని వెళ్లింది.. అయితే కుళాయి వద్ద మరో మహిళతో ఆమె, తల్లి కలిసి గొడవ పడ్డారు.. ఈ గొడవ పెద్దదిగా మారింది.. ఆ మహిళ ఇంటర్ విద్యార్థిని తల్లి పై పోలీస్ కేసు పెడుతానని అనడంతో ఆందోళన చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
చినికిచినికి గాలివానలా గొడవ:
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రానికి చెందిన రమేష్, లక్ష్మి దంపతులకు వైష్ణవి (18) కుమార్తె . వైష్ణవి బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు పరిక్షలు రాస్తుంది. కాలనీలోని కుళాయి వద్ద వైష్ణవి, ఆమె తల్లి లక్ష్మి పొరుగున ఉండే శోభ అనే మహిళతో గొడవపడ్డారు.. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు... చివరకు ఈ వివాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. శోభతో పాటు సురేష్ అనే వ్యక్తి కూడా గొడవలకు దిగారు. దీంతో అందరిముందు తనతో వీరిద్దరూ గొడవ చేయడంతో.. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో ఇంటర్ విద్యార్థి వైష్ణవి తీవ్ర మనస్తాపానికి గురైంది. శోభ, సురేష్ ఇద్దరు వైష్ణవిపై కేసు పెట్టడంతో ఇక పోలీస్టేషన్ కు వెళ్లాలా అని ప్రశ్నించుకుంది. తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరకు పోలీసుల కేసు భయంతో ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్ అయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోని ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు శోభ, అదే కాలనీలో ఉండే సురేష్ కారణమని సూసైడ్ నోట్‌లో రాసింది. విద్యార్థిని తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎందుకిలా చేస్తున్నారు:
పరీక్షకు హాజరుకావాల్సిన కుమార్తె ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో తెలిసి తెలియని వయసులో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా బాధాకరం. పిల్లలు ఏ విషయం అయినా తల్లి దండ్రులకు చెప్పుకోవాలి.. అప్పుడే పేరెంట్స్ పిల్లల సమస్యలను పరిష్కరిస్తారు.. అలా కాకుండా వారిలో వారే బాధపడితే చివరకు తల్లి దండ్రులకు కన్నీరే మీగులుతుంది. గోరంత గొడవను కొండంతగా చూసి వాటిని ఆలోచిస్తూ అవమానం జరిగిందని, ఆవేశంతో తనువు చాలిస్తూ కుటుంబాలకు తీరని శోకాన్ని నింపడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.