(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)
ఈ రోజుల్లో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా చాలామంది వాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఆ యువకుడికి పుట్టక నుంచి కాళ్లు, చేతులు లేవు. అందరిలా నడవలేని పరిస్థితి. మొండి చేతులతో పనిచేయలేని దయనీయ స్థితి. అయితేనేం? అతడిలో ఉన్న పట్టుదల ముందు అవేవీ పెద్ద సమస్యలు కాలేదు. సాధారణ మనుషులు చేయగల అన్ని పనులు అతడు చేస్తాడు. చాలా పనులను అతడు అవలీలగా పూర్తి చేసి ఔరా అనిపిస్తాడు. అంతే కాకుండా తను చదువుకునే ఇంటర్ కాలేజీలో తను క్లాస్ లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. అయితే శారీరకంగా లోపాలు ఉన్నా మానసికంగాను , చదువులోనూ, తెలివిలోనూ దేని తీసిపోకుండా ఉంటాడు. ఇంటర్ చదువుతున్న అతడిని పాక్షికంగా దివ్యాంగురాలైన ఓ అమ్మాయి ఇష్టపడింది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినకుండా ప్రేమించిన దివ్యాంగుడిని పెళ్లి చేసుకొని తన పెద్ద మనస్సును చాటుకుంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్ కు చెందిన శంకర్ నాయక్ కు పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేవు. అతను జడ్చర్లలో ఇంటర్ చదువుతున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ కు చెందిన సునీత తో పరిచయమైంది.
పాక్షికంగా దివ్యాంగురాలైన సునీతతో ప్రేమకు పునాదులు పడ్డాయి. ఎవరిని ఆశ్రయించనా వీరి ప్రేమ వివాహనికి ఒప్పుకోలేదు. మరికల్ సర్పంచ్ హన్మంతుతో పాటు శంకర్ తరఫు బంధువులు కొద్దిమంది సమక్షంలో బిజినపల్లి మండలం వట్టెం దేవస్థానంలో వివాహంతో ఒక్కటయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disabled person marriage, Love marriage, Mahabubnagar, Marriage, Nagarkarnol district