Inter Student Suicide | తెలంగాణలో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ సూసైడ్ చేసుకున్నాడు. అయితే కొద్దిరోజుల్లో ఇంటర్ హెగ్జామ్స్ జరగనుండడంతో ఒత్తిడితోనే శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శివకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు.
కాగా రాష్ట్రంలో ఏడాదిగా సగటున 350 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రధానంగా పరీక్షల ఒత్తిడి, చదువు భారంతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. గత 20 రోజుల్లో ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే విద్యార్థులు సూసైడ్ చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. విద్యార్థుల కఠిన నిర్ణయం బాధిత కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగులుస్తుంది.
ఇటీవల సాత్విక్ అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ క్లాస్ రూమ్ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్య వేధింపులు భరించలేక సాత్విక్ సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక సాత్విక్ రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్ లో సాత్విక్ తను పడ్డ బాధను వివరిస్తూ రాసిన అంశాలు ప్రతీ ఒక్కరిచేత కంటతడి పెట్టిస్తున్నాయి. "అమ్మానాన్నఐ లవ్ యూ..మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ప్రిన్సిపాల్, లెక్చరర్లు పెట్టే టార్చర్ తో ఆత్మహత్య చేసుకుంటున్నాను. కృష్ణా, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. హాస్టల్ లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి. అమ్మానాన్న ఐ లవ్ యూ..మిస్ యూ ఫ్రెండ్స్" అంటూ సాత్విక్ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ లెటర్ ప్రతీ ఒక్కరిచేత కన్నీళ్లు పెట్టిస్తుంది.
మరోవైపు సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది. ఈ ఘటనపై కేసు రాసిన పోలీసులు.. కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి,.. వార్డెన్లు నరేష్, జగన్, మేనేజ్‌మెంట్ దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రి వార్డెన్లలో ఒకరు పారిపోయారు. ఈ ఘటన పూర్తిగా మరిచిపోకముందే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Telangana