హైదరాబాద్ నగర పోలీసులకు సవాల్ విసిరిన డ్రగ్స్‌తో పాటు గంజాయి మాఫియా పై గత కొద్ది కాలంగా ఉక్కుపాదం పాదం మోపుతున్న విషయం తెలిసిందే.. అయితే పోలీసులు డ్రగ్స్ మాఫియాను పట్టుకోవడం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపడడం లాంటి చర్యలు చేపడుతూ కంట్రోల్లోకి తీసుకువస్తున్నారు.. కాగా తాజాగా నిన్న నగరంలోని డ్రగ్స్ అమ్ముతున్న మూడు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా వారిలో అంతరాష్ట్రాలకు చెందిన వారు రెండు ముఠాలు కాగా హైదరాబాద్ నగరానికి చెందిన వారు కూడా ఉన్నారు..
ముఖ్యంగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం నగరానికి చెందిన కొందరు యువకులు డ్రగ్స్ అలవాటు పడి ఆ తర్వాత వాడడమే కాదు అమ్మడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు వెళ్లడించారు. ఇలా నగరంలోని తిరుమలగరి ప్రాంతానికి చెందిన అనిరుధ్ అనే గ్రాఫిక్ డిజైనర్ జల్సాలకు అలవాడు నిత్యం గొవాకు వెళ్లేవాడని, ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటు పడి మీర్‌పేటకు చెందిన తన స్నేహితుడితో కలిసి గోవాకు వెళ్లిన సంధర్భంలో డ్రగ్స్ తీసుకునేవారు.. దీంతో ఇది అలవాటుగా మారి దాన్నే వ్యాపారంగా మలచుకున్నారు. నగరంలో తనకు తెలిసిన మిత్రులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కాగా గోవా నుండి ఒక్కో ప్యాకెట్‌ను గోవాలో 3000 రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో 8000 నుండి 10 వేల రూపాయల వరకు అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు.కాగా పక్క సమాచారం మేరకు వీరిని అరెస్ట్ చేశారు.
Huzurabad : కడప నుండి కరీంనగర్‌కు చేరింది, అయినా యువతికి దక్కని న్యాయం, చలిలోనే..! ఇంతకి ఏం జరిగింది..?
3 వేల ప్యాకెట్ 10 వేలకు
మరోవైపు మరోముఠా సైతం ముంబయి నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలుసుకుని వారిని సైతం అరెస్ట్ చేశారు. కాగా వీళ్లకు ముంబయిలో ఉండే టోని అనే విదేశీ సప్లైయర్ చేరవేస్తున్నట్టు సమాచారం సేకరించారు. అంతర్జాతీయ సంబంధాలు ఉన్న టోని ముంబయిలోని సుమారు 10 వేల మంది నైజీరియన్లు ప్రాంతంలో ఉంటూ పోలీసులకు సైతం దొరక కుండా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు చెప్పారు. కాగా టోనిని పట్టుకునేందుకు చాలా మంది భయపడతారని , కాని తాము మాత్రం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఆ టోని పట్టకుంటామని సీపీ ఆనంద్ తెలిపారు. కాగా జల్సాలతో పాటు ఈజీ మనీకి అలవాటుపడిన యువతే డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, ఈ క్రమంలోనే డ్రగ్స్‌ను వినియోగించే విద్యార్థులు, యువతతోపాటు ఇతరును కూడా ఇకపై వదిలిపెట్టకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.