హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad : మందులు పిచికారి చేస్తున్న ఇంటర్ విద్యార్థిని... తల్లిదండ్రులకు తోడుగా.. వ్యవసాయం

Nizamabad : మందులు పిచికారి చేస్తున్న ఇంటర్ విద్యార్థిని... తల్లిదండ్రులకు తోడుగా.. వ్యవసాయం

Nizamabad : మందులు పిచికారి చేస్తున్న ఇంటర్ విద్యార్థిని... తల్లిదండ్రులకు తోడుగా.. వ్యవసాయం

Nizamabad : మందులు పిచికారి చేస్తున్న ఇంటర్ విద్యార్థిని... తల్లిదండ్రులకు తోడుగా.. వ్యవసాయం

Nizamabad : ఓ వైపు చదువు మరోవైపు వ్యవసాయం చేస్తోంది ఓ యువతి.. అన్ని రంగాల్లో మేమున్నామంటూ..తల్లిదండ్రులతో పాటు సమాజానికి భరోసాగా మారి...వ్యవసాయంలో తోడుగా ఉంటుంది.. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా అన్ని పనులను చేస్తూ...అదర్శంగా నిలుస్తోంది.

ఇంకా చదవండి ...

  నిజామాబాద్ జిల్లా,

  న్యూస్18 తెలుగు, ప్ర‌తినిధిః పి మ‌హేంద‌ర్,

  ఆడపిల్లలంటే పెద్ద గుదిబండగా మారతారనే అభిప్రాయం ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల్లో నెలకొంటుంది..కాని వారి అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ...కొంతమంది ఆడపిల్లలు తమ ప్రతిభను కనబరుస్తారు..ప్రపంచలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారనే సంఘటనలు ఎన్ని ఉన్నా..ఇంకా కొన్ని రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించ లేకపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయక దేశమైన భారత దేశంలో ఈ పరిస్థితి నెలకొంది..వ్యవసాయంలో మహిళల పాత్ర మేజర్‌గానే ఉన్నా ఎందుకనే మగవారికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు ఈ రంగంలో మహిళలకు రాలేదు...


  ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని నందిపేట మండలం, పూర్ గ్రామానికి చెందిన రాములు, ముత్తేమ్మ దంప‌తుల‌కు ముగ్గురు సంతానం.. అందరూ ఆడ‌పిల్ల‌లే.. పెద్ద‌వారైన ఇద్ద‌రు కుమార్తెలకు పెళ్లిల్లు చేసి అత్తారింటికి పంపారు.. చిన్న కుమార్తె రాధ‌నే కొడుకుగా మారింది.. ఓ వైపు ఇంటర్ చదువుతూనే..మరోవైపు తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది.. ఈ క్రమంలోనే వారికి ఉన్న ముడేక‌రాల భూమిలో వ్య‌వ‌సాయం చేస్తుంది... పురుషులతో సమానంగా పొలంలో మందులు పిచికారి చేయడంతో పాటు అన్ని రకాల పనులు చేస్తూ..ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వస్తున్న ఆధునిక పద్దతులను తెలుసుకుంటూ.. వ్యవసాయాన్ని చేస్తున్నానని రాధ చెబుతోంది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Agriculture, Nizamabad

  ఉత్తమ కథలు