Home /News /telangana /

INTER FAILED STUDENT SHOT HIMSELF IN FEAR OF IIT RESULTS IN RK PURAM UNDER NEREDMET MS

మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ఐఐటీ ర్యాంక్ వస్తుందో.. లేదోనన్న ఆందోళనతో

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

    హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లోని ఆర్కేపురంలో దారుణం జరిగింది.ఇంటర్‌లో బ్యాక్‌లాగ్‌లపై తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై సోహెల్(22) అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. తండ్రి గన్‌తోనే నుదుటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఐఐటీ పరీక్షలు రాసిన సోహెల్.. మంగళవారం ఫలితాల విడుదల నేపథ్యంలో.. దానిపై కూడా ఆందోళన చెందినట్టు తెలుస్తోంది. తొలుత తండ్రీ కొడుకుల మధ్య నెలకొన్న కుటుంబ కలహాలే కాల్పులకు దారితీసి ఉంటాయని వార్తలు వచ్చినప్పటికీ.. ఐఐటీ ర్యాంక్ వస్తుందో రాదోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సోహెల్ ఆత్మహత్య గురించి తండ్రి పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు.
    First published:

    Tags: Crime, Hyderabad, Telangana

    తదుపరి వార్తలు