హోమ్ /వార్తలు /తెలంగాణ /

Etela Rajendar: మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలు.. ప్రభుత్వానికి కీలక నివేదిక

Etela Rajendar: మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలు.. ప్రభుత్వానికి కీలక నివేదిక

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా మాజీమంత్రి ఈటల రాజేందర్ గురించే చర్చ జరుగుతోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తరువాత తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో పాటు ఇతర నేతలతో సమాలోచనలు జరుపుతున్న ఈటల రాజేందర్.. ఎట్టకేలకు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా మాజీమంత్రి ఈటల రాజేందర్ గురించే చర్చ జరుగుతోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తరువాత తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో పాటు ఇతర నేతలతో సమాలోచనలు జరుపుతున్న ఈటల రాజేందర్.. ఎట్టకేలకు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Etela Rajendar: ప్రభుత్వం పేద బడుగు వర్గాలకు ఇచ్చిన సుమారు 66.01 ఎకరాల అసైన్మెంట్ భూములను జమున హాచరీస్ వారు కబ్జాచేశారని తేల్చారు.

  మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాలకు సంబంధించి దర్యాప్తు కమిటీ ప్రభుత్వానికి కీలక నివేదిక అందించింది. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు కమిటీ నిగ్గు తేల్చింది. జమున హేచరిస్ ఆధీనంలో అక్రమంగా 66 ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలగించారని నివేదికలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా జమున హేచరీస్ పౌల్ట్రీ షెడ్డులు నిర్మించారని.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేశారని నివేదికలో తెలిపారు. అసైన్డ్ ల్యాండ్‌ను ఈటల రాజేందర్ కబ్జా చేసినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన మెదక్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు.. ప్రభుత్వం పేద బడుగు వర్గాలకు ఇచ్చిన సుమారు 66.01 ఎకరాల అసైన్మెంట్ భూములను జమున హాచరీస్ వారు కబ్జాచేశారని తేల్చారు.

  ఈ మొత్తం వ్యవహారంలో 20 మంది బాధితుల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. కలెక్టర్ సహా పలువురు అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి విచారణ చేశారు. వీరిలో కొందరు మంత్రి ఈటల రాజేందర్ బెదిరించి తమ భూములను లాక్కున్నారని చెప్పినట్టు సమాచారం. ఇందులో కొన్ని పట్టా భూములను వ్యవసాయేతర భూములుగా మార్చారని నివేదికలో పొందుపర్చారు. ఈ ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగానే పలు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  ఇదిలా ఉంటే తాను ఏ భూమిని కబ్జా చేయలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తాను కొన్నవి వ్యవసాయ భూములు కావని చెప్పారు. 2016లో జమున హెచరీస్ కోసం ఎకరం రూ.6 లక్షల చొప్పున 40 ఎకరాల భూమిని ఒకేసారి కొన్నామని మంత్రి చెప్పారు. కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణంగా తీసుకున్నట్లు ఈటల తెలిపారు. తాను తీసుకున్న భూముల చుట్టూ అసైన్డ్ భూములున్న విషయాన్ని సీఎంకు కూడా చెప్పానని, ఆ భూములన్నీ ఇప్పటికీ వాళ్ల దగ్గరే ఉన్నాయని మంత్రి ఈటల చెప్పారు. ముందస్తు ప్రణాళికతో, కట్టు కథతో తన క్యారెక్టర్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తాను కొన్నవి వ్యవసాయ భూములు కావని ఈటల చెప్పారు. అసైన్డ్ భూములు అమ్మవద్దని, కొనవద్దని తానే రైతులకు చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. రైతులే భూములను ప్రభుత్వానికి సరండర్ చేస్తూ లేఖలు ఇచ్చారని మంత్రి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్, విజిలెన్స్ డీజీతోనే కాకుండా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి మంత్రి ఈటల సవాల్ విసిరారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Etela rajender, Telangana

  ఉత్తమ కథలు