Telangana News: ఉప్పొంగిన వాగు.. వాగు వద్దే ప్రసవించిన మహిళ.. ఎక్కడంటే..

మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తున్న గ్రామస్తులు

Telangana News: పురుటి నొప్పులతో ఆసుపత్రికు వెళ్తూ మార్గ మధ్యలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును దాటలేక ఓ నిండి గర్బిణి అష్టకష్టాలు పడి చివరకు వాగు వద్దే ప్రసవించిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది.

  • Share this:
    (కట్టా లెనిన్, ఆదిలాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లోకి నీరు చేరడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఒక ఊరి నుంచి మరో ఊరికి పోదామంటే కనీసం రోడ్లు సరిగ్గా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆమెను ఆసుపత్రికి తలరలిస్తుండగా.. మార్గ మధ్యలో వాగు పొంగి పొర్లింది. దీంతో నొప్పులకు భరించలేక ఆ వాగు వద్దు ప్రసవించింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది.

    దీంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దత్తోజిపేట గ్రామానికి చెందిన రొడ్డ ఎల్లవ్వకు పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకుని బయలుదేరారు. కాగా భారీ వర్షం కారణంగా దత్తోజిపేట్ లో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగు దాట లేక నాలుగు గంటల పాటు అక్కడే నిలిచిపోయారు.

    నిండు గర్భిణి ఎల్లవ్వ తీవ్ర ఇబ్బందిపాలైంది. చివరకు వాగు వద్దే ప్రసవించింది. కొంత వాగులో ఉధృతి తగ్గడంతో గ్రామస్థులు వాహనానికి ముందు జెసిబి ని కట్టి దాని సహాయంతో తల్లిబిడ్డలను కడెం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డా ఇద్దరు క్షేమంగానే ఉన్నారు.
    Published by:Veera Babu
    First published: