హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabub Nagar: తాళం వేసుకున్నోడిదే ఇల్లు.. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇంత ఈజీగా వస్తుందా?

Mahabub Nagar: తాళం వేసుకున్నోడిదే ఇల్లు.. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇంత ఈజీగా వస్తుందా?

డబుల్ బెడ్ రూమ్ ఇంటికి తాళం

డబుల్ బెడ్ రూమ్ ఇంటికి తాళం

Mahabubnagar: ప్రభుత్వ అనుమతులు లేకున్నా.. అధికారులు కేటాయించకపోయినా.. కొందరు స్థానికులు మాత్రం నచ్చిన ఇళ్లలో చేరిపోయారు. గదుల్లో సామాగ్రి భద్రపరిచి ఇళ్లకు తాళాలు వేసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(సయ్యద్ రఫీ, న్యూస్ 18 తెలుగు,  మహబూబ్ నగర్)

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూమ్ పథకాన్ని (Telangana Double Bedroom Scheme) తీసుకొచ్చింది. నిలువ నీడలేని పేదలకు అధునాత సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ పథకం పక్క దారి పడుతోంది. అర్హులకు కాకుండా.. అనర్హులకు దక్కుతున్నాయి. మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా భూత్పూర్ పూరపాలిక పరిధిలోని సిద్దయ్యపల్లి గ్రామ శివారులో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లలోకి అనధికార ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం లబ్ధిదారులకు ఎంపిక తర్వాత కేటాయించాల్సిన ఇళ్లలోకి ఎవరికి వారే ప్రవేశిస్తున్నారు.  ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగe.. మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. మురుగు కాలువ నిర్మాణాల, విద్యుత్తు వంటి కనీస సదుపాయాలు కల్పించాలి. ఐతే కేటాయింపు ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో చాలామంది ఇల్లు లేని వాళ్లు.. నాయకుల అండతో కొత్త ఇంటిలోకి వెళ్లి నివాసం ఉంటున్నారు.

మూడేళ్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్‌పోర్ట్‌లా మారిపోతుంది ఇలా (Photo

భూత్పూర్ మండలం అమిస్తాపూర్ పంచాయతీగా ఉన్నప్పుడు రూ.14 కోట్ల అంచనా వ్యయంతో జి ప్లస్ టు విధానంలో 288 ఇళ్లను బ్లాక్ వారిగా నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. నిధుల కొరతతో నిమ్మదిగా సాగిన నిర్మాణాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ భవనాలను ప్రారంభించారు. అమిస్తాపూర్‌లో రహదారి విస్తీర్ణంలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి లక్కీ డీప్ ద్వారా 42 ఇళ్లను కేటాయించారు. ఇల్లు పొందిన వారిలో కొందరు నివాసం ఉండగా.. సౌకర్యాలు లేని కారణంగా మరికొందరు ఇంకా చేరలేదు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో కలిసి బాలీవుడ్ నటి పాదయాత్ర.. ఫొటోలు వైరల్

ఐతే ప్రభుత్వ అనుమతులు లేకున్నా.. అధికారులు కేటాయించకపోయినా.. కొందరు స్థానికులు మాత్రం నచ్చిన ఇళ్లలో చేరిపోయారు. గదుల్లో సామాగ్రి భద్రపరిచి ఇళ్లకు తాళాలు వేసుకున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో 100కు పైగా కుటుంబాలు అనధికారికంగా ఇండ్లను స్వాధీనం చేసుకొని ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ పరిణామంతో అసలు తమకు ఇళ్లు వస్తాయో లేదో అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి వచ్చిన వారు మాత్రం.. ధీమాతో ఉన్నారు. తమకు తప్పకుండా ఇల్లు దక్కుతాయేనని భరోసా తోనే.. ఇక్కడ ఉంటున్నట్లు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై భూత్పూర్ తహశీల్దార్ చెన్న కిష్టన్నను సంప్రదించగా.. రెండు పడకల గదులు ఇళ్లను ఇప్పటివరకు 42 మందికి మాత్రమే కేటాయించామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. అక్కడ అనధికారికంగా ఉండే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

First published:

Tags: Double bedroom houses, Mahabubnagar, Telangana

ఉత్తమ కథలు