ISRO : హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ మ్యూజియం

ఇస్రో పరిశోధనలు,ఖగోళ విజ్ఞానం,విజయాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. 2D,3D మోడల్స్ సహాయంతో మ్యూజియంలోని ఖగోళ వస్తువులను పరిశీలించవచ్చు. జీఎస్ఎల్‌వీ ఎంకే-3, చంద్రయాన్‌ లాంచ్‌ వెహికిల్‌, రోహిణి, ఆపిల్‌, చంద్రయాన్‌-1, మంగళ్‌యాన్‌ లాంటి ఉపగ్రహాలను మ్యూజియంలో అందుబాటులో ఉంచారు.

news18-telugu
Updated: July 31, 2019, 1:43 PM IST
ISRO : హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ మ్యూజియం
ప్రైవేట్ స్పేస్ మ్యూజియం
  • Share this:
దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ మ్యూజియం హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సహకారంతో ఏర్పాటైన ఈ మ్యూజియాన్ని శుక్రవారం ప్రారంభించారు. బీఏసీఆర్‌ఐ 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బిర్లా సైన్స్‌ మ్యూజియంలో దీన్ని ఏర్పాటు చేశారు.ఇస్రో పరిశోధనలు,ఖగోళ విజ్ఞానం,విజయాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. 2D,3D మోడల్స్ సహాయంతో మ్యూజియంలోని ఖగోళ వస్తువులను పరిశీలించవచ్చు. జీఎస్ఎల్‌వీ ఎంకే-3, చంద్రయాన్‌ లాంచ్‌ వెహికిల్‌, రోహిణి, ఆపిల్‌, చంద్రయాన్‌-1, మంగళ్‌యాన్‌ లాంటి ఉపగ్రహాలను మ్యూజియంలో అందుబాటులో ఉంచారు.

కొన్నేళ్ల క్రితం స్పేస్ ఎగ్జిబిషన్‌కి సంబంధించి ఇస్రో సహకారంతో అంతర్జాతీయ వారోత్సవాలను నిర్వహించాం. అందులో భాగంగా నాలుగు రోజుల పాటు స్పేస్‌కు సంబంధించిన అంశాలపై ఈవెంట్ నిర్వహించాం. విద్యార్థుల నుంచి దానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆ స్థాయి స్పందన చూశాక.. శాశ్వతంగా ఒక స్పేస్ మ్యూజియం ఏర్పాటు చేస్తే బాగుండనిపించింది. అలా బిర్లా మేనేజ్‌మెంట్&ఇస్రో కలిసి స్పేస్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది.
బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్దార్థ్


First published: July 31, 2019, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading