Home /News /telangana /

భారతీయుల బ్రెయిన్స్ చిన్నవి... పరిశోధనలో వెల్లడి

భారతీయుల బ్రెయిన్స్ చిన్నవి... పరిశోధనలో వెల్లడి

భారతీయుల బ్రెయిన్స్ చిన్నవి... పరిశోధనలో వెల్లడి (File)

భారతీయుల బ్రెయిన్స్ చిన్నవి... పరిశోధనలో వెల్లడి (File)

Indians Brains : కొత్త కొత్త పరిశోధనల్లో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. విదేశీయుల మెదళ్లతో పోల్చితే... భారతీయుల మైండ్లు చిన్నగా ఉన్నట్లు తేలింది. అందుకు కారణమేంటో తెలుసుకుందాం.

    Indians Brains : IIIT హైదరాబాద్ పరిశోధకులు మొదటిసారిగా ఇండియన్ బ్రెయిన్ అట్లాస్ తయారుచేస్తున్నారు. ఈ పరిశోధనలో తేలిందంటంటే... అమెరికా లాంటి పశ్చిమ దేశాలు, జపాన్ లాంటి తూర్పు దేశాల ప్రజలతో పోల్చితే... భారతీయుల మెదళ్లు పొడుగు, వెడల్పూ తక్కువగా ఉన్నాయి. బరువు కూడా తక్కువే. ఈ పరిశోధన వల్ల అల్జీమర్స్, ఇతర మతిమరపు వ్యాధుల్ని ముందుగానే కనిపెట్టడం వీలవుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ రీసెర్చ్‌ వివరాల్ని న్యూరోలజీ ఇండియా జర్నల్‌లో రాశారు. కొత్తగా తెలిసిన అంశాలతోపాటూ... భారతీయుల బుర్రలకు సంబంధించి మరింత లోతుగా తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ బ్రెయిన్ అట్లాస్‌ను తయారుచేసేందుకు మరో 100 మంది ఆసక్తి ఉన్నవారిని చేర్చుకోబోతున్నారు.


    మాంట్రియల్ న్యూరోలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌ (MNI)లో బ్రెయిన్‌కి సంబంధించిన టెంప్లేట్ ఉంది. అది ప్రపంచంలో చాలా మందికి ఉండే సగటు మెదడు నిర్మాణం. చైనా, కొరియాలో కూడా ఇలాంటివి ఉన్నాయి. వాటితో పోల్చితే... భారతీయుల మెదళ్లు చిన్నవిగా ఉన్నాయి. ఐతే... ఇప్పటివరకూ భారతీయుల మెదళ్లకు సంబంధించిన మ్యాప్ లేదు. ఇప్పుడు 50 మంది పరిశోధకులు కలిసి భారతీయుల బ్రెయన్ టెంప్లేట్‌ని తయారుచేశారు. పశ్చిమ ఆసియా దేశాల మెదళ్లతో పోల్చితే... ఇండియన్స్ మెదళ్లు... కాస్తంతా చైనా, కొరియా బ్రెయిన్లకు దగ్గరగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.

    కాలం గడుస్తున్నకొద్దీ... మనుషుల బ్రెయిన్స్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆసియా దేశాల ప్రజల మెదళ్లు నానాటికీ చిన్నగా అవుతున్నాయి. ఈ మార్పు ప్రభావం మనుషుల వయసు, జ్ఞాపకశక్తి వంటివాటిపై పడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు చేస్తామంటున్నారు.

     

    Pics : అందాల తార అర్తనా బిను క్యూట్ ఫొటోస్




    ఇవి కూడా చదవండి :

    జగన్‌ కేసులపై ఉండవల్లి సంచలన కామెంట్స్...

    బోరుబావిలో చిన్నారి మృతి... రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత

    Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు


    Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

    Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Telugu news, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు