ప్రశాంత్‌, వారీలాల్‌ని విడిచిపెట్టండి.. పాకిస్తాన్‌కు కేంద్రం విజ్ఞప్తి

ప్రశాంత్, వారీలాల్‌ను కలిసేందుకు భారత దౌత్య కార్యాలయానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు వీలైనంత త్వరగా ఆ ఇద్దరు యువకులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసినట్లు విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

news18-telugu
Updated: November 21, 2019, 5:15 PM IST
ప్రశాంత్‌, వారీలాల్‌ని విడిచిపెట్టండి.. పాకిస్తాన్‌కు కేంద్రం విజ్ఞప్తి
వారీలాల్, ప్రశాంత్
  • Share this:
ఇద్దరు భారతీయ యువకులు పాకిస్తాన్ పోలీసుల చెరలో ఉన్న విషయం తెలిసిందే. విశాఖకు చెందిన ప్రశాంత్, మధ్యప్రదేశ్‌కు చెందిన వారీలాల్ బాహవల్‌పూర్ జైల్లో మగ్గుతున్నారు. ఇటీవల ప్రశాంత్ వీడియో బయటకు రావడంతో వారిద్దరు పాకిస్తాన్‌లో ఉన్నట్లు ప్రపంచానికి తెలిసింది. ఈ అంశంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. 2016- 2017 సమయంలో వారిద్దరు పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లారని.. అప్పుడే అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చామని వెల్లడించింది. ఆ తర్వాత పాక్ వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని స్పష్టం చేసింది.

ఇటీవల బయటకొచ్చిన ప్రశాంత్ వీడియోను చూసి షాక్ తిన్నామని విదేశాంగ శాఖ తెలిపింది. సోమవారం పాకిస్తాన్ అధికారులతో మాట్లాడామని.. వారిద్దరిని క్షేమంగా ఉంచాలని కోరినట్లు వెల్లడించారు. ప్రశాంత్, వారీలాల్‌ను కలిసేందుకు భారత దౌత్య కార్యాలయానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు వీలైనంత త్వరగా ఆ ఇద్దరు యువకులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసినట్లు విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, పాకిస్తాన్ చెరలో ఉన్న ప్రశాంత్ స్వస్థలం విశాఖపట్టణం. కొన్నేళ్ల కింద మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ..కూకట్‌పల్లిలో ఉండేవాడు. ఐతే రెండేళ్ల క్రితం నుంచి అతడు కనిపించకుండా పోయాడు. బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న సమయంలో స్వప్నికా పాండే అనే యువతిని ప్రేమించాడని ప్రశాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ప్రేమ విఫలం కావడం వల్ల ఒత్తిడితో రాజస్థాన్‌ వెళ్లిపోయాడని..అక్కడి నుంచి పొరపాటున పాక్‌లో భూభాగంలోకి వెళ్లాడని వెల్లడించారు. ప్రశాంత్‌ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని అతడ తల్లిదండ్రులు కోరుతున్నారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు