Home /News /telangana /

INDIA CHINA SANTOSH BABU KILLED 3 INFILTRATORS IN KUPWARA SAYS HIS FATHER SK

కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించిన కల్నల్ సంతోష్

కల్నల్ సంతోష్ బాబు

కల్నల్ సంతోష్ బాబు

కొంతకాలం భారత ఆర్మీ తరపున కాంగో దేశంలోనూ పనిచేశారు సంతోష్. 37 సంవత్సరాల చిన్న వయసులో కల్నల్‌గా పదోన్నతి పొందారు.

    కల్నల్ సంతోష్ బాబు.. భరత మాత ముద్దు బిడ్డ..! దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్..! మన తెలంగాణకు చెందిన వీర సైనికుడు..! లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. సంతోష్ స్వస్థలం సూర్యాపేట. ఏడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. సంతోష్ మృతితో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వీరసైనికుడికి అందరూ ఘన నివాళ్లు అర్పిస్తున్నారు.

    కల్నల్ సంతోష్ బాబు 6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అనంతరం ఇండియన్ మిలటరీ అకాడమీలో చదువుకున్నారు. చదువు పూర్తైన తర్వాత  2004 డిసెంబరులో ఆర్మీలో చేరారు. మొట్ట మొదట జమ్మూలోనే విధులు నిర్వహించారు. మొత్తం 15 ఏళ్లుగా ఆయన సర్వీస్‌లో ఉన్నారు. తన సర్వీస్‌లో ఎక్కువ కాలం కాశ్మీర్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, పాకిస్థాన్ సరిహద్దులోనే విధులు నిర్వహించారు. కొంతకాలం భారత ఆర్మీ తరపున కాంగో దేశంలోనూ పనిచేశారు. 37 సంవత్సరాల చిన్న వయసులో కల్నల్‌గా పదోన్నతి పొందారు.

    ఇక 2007లో పాకిస్తాన్ బోర్డర్‌లో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదలను ఆయన అంతమొందించారు. కల్నల్ సంతోష్ పనిచేస్తున్న యూనిట్ మొత్తం హైదరాబాద్‌కు బదిలీ అయింది. ఆగస్టులో హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. కానీ అంతలోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. తల్లిగా బాధపడుతున్నప్పటికీ.. దేశ కోసం ప్రాణాలర్పించినందుకు గర్వంగా ఉందని ఆయన తల్లి మంజుల అన్నారు. ఎంతో ధైర్య సాహసాలు కలిగిన సైనికుడి కోల్పోయినందుకు ఇప్పుడు యావత్ దేశం కన్నీరు పెడుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Indian Army, Suryapet, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు