Home /News /telangana /

INDEPENDENT CANDIDATE GIVING TOUGH FIGHT IN MLC ELECTIONS IN ADILABAD VRY

Adilabad : దండుకడుతున్న ఆదివాసీలు – దడపుట్టిస్తున్న స్వతంత్ర్య అభ్యర్థి

adilabad

adilabad

Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులు దండు కడుతున్నారు. ( mlc elections ) ఎమ్మెల్సి ఎన్నికల బరిలో నిలిచిన ఆదివాసీ గిరిజన సంఘం మహిళా అభ్యర్థికి మద్దతుగా ప్రచారం సాగిస్తున్నారు.

    ఉమ్మడి ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి స్థానికి జరుగనున్న ఎన్నిక రోజురోజుకు ఉత్కంఠను రేపుతోంది. జనవరి 4వ తేదీ నాటికి ఖాళీ అవుతున్నఈ స్థానానికి ప్రభుత్వం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోని స్థానిక సంస్థల సభ్యుల స్థానాలతో కలిపి ఎన్నిక నిర్వహిస్తోంది. ( mlc elections ) ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసన మండలి స్థానం కోసం 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో అధికార టిఆర్ ఎస్ పార్టీ కి చెందిన అభ్యర్థి దండె విఠల్ ఒకరు. మిగిలిన 23 మంది అభ్యర్థులు స్వతంత్రులుగానే తమ నామినేషన్ లను దాఖలు చేశారు.

    కాగా కాంగ్రెస్, బిజెపి ఈ ఎన్నిక పట్ల ఆసక్తి కనబరచకపోవడంతో ఆయా పార్టీలకు చెందిన ఒకరిద్దరు నామినేషన్లు వేసినప్పటికి తర్వాత ఉప సంహరించుకున్నారు. ( mlc elections ) అధికార టిఆర్ ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసి తర్వాత ఉప సంహరించుకున్నారు. అదే సమయంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) మద్దతుతో ఆదివాసి గిరిజన మహిళా సంఘం నాయకురాలు పెందూర్ పుష్పారాణి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ( mlc elections ) అయితే రాష్ట్రంలోని ఆరు స్థానాలు ఎకగ్రీవమయ్యాయి. అలాగే ఆదిలాబాద్ స్థానాన్ని కూడా ఏకగ్రీవం చేసేందుకు అధికారి టిఆర్ ఎస్ తీవ్ర ప్రయత్నం చేసింది. ఆ పార్టీకి చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వం విప్ బాల్క సుమన్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, జడ్పి చైర్మెన్ లు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

    Teenmar mallanna : కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులను కట్టేసి, ఆ కుటుంబాలతో కొట్టిస్తా...!


    అయితే నాటకీయ పరిణామాల మధ్య 22 మంది అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసినా, బరిలో నిలిచినా ఆదివాసి మహిళ నామినేషన్ ను ఉపసంహరించుకునేలా చేసిన వ్యూహం బెడిసికొట్టింది. చివరకు అధికార పార్టీ అభ్యర్థి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పారాణి బరిలో నిలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ( mlc elections ) ఒక్క ఓటు వచ్చినా సరే తాను పోటీ నుండి తప్పుకునే ప్రసక్తే లేదని, తాను చివరి వరకు ఈ ఎన్నికలో పోటీలో ఉంటానని నామినేషన్ల ఉపసంహరణ రోజే స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పారాణి ప్రకటించారు.

    తనదైన శైలిలో ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఆదివాసీ గిరిజన సంఘాలు కూడా ఆమెకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఒక్కొక్కరుగా దండు కట్టి ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వస్తున్నారు.
    విపక్షాలతోపాటు అధికార పక్షంలోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేలా పావులు కదుపుతున్నారు. ( mlc elections ) ఇప్పటికే కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ బహిరంగంగానే పెందూర్ పుష్పారాణికి మద్దతు ప్రకటించారు.

    Gadwala : కేసిఆర్ డౌన్‌..డౌన్.. మందుబాబుల హల్‌చల్..ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ వద్ద.. ధర్నా.


    బిజెపి కూడా పరోక్షంగా స్వతంత్ర అభ్యర్థికే మద్దుతు ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 937 మంది ఓటర్లు ఉండగా, అందులో మెజార్టీ ఓటర్లు అధికార టిఆర్ ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు.
    జడ్పిటిసి, ఎంపిటిసిల్లో గిరిజన సభ్యులు ఉన్నారు. ( mlc elections ) గెలుపుపై అధికార పార్టీ ధీమాతో ఉన్నప్పటికి స్వతంత్ర్య అభ్యర్థి తనదైన శైలిలో ప్రచారం సాగిస్తుండటం అధికార పార్టీకి దడపుట్టిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్కంఠను రేపుతున్న ఆదిలాబాద్ స్థానిక మండలి ఎన్నికల బరిలో నిలిచిన ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Mlc elections, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు