#IndependenceDay 2019 : మంచిర్యాలలో 83 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ...

#IndependenceDay 2019 : దేశభక్తి ఉప్పొంగుతోంది. పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరూ... స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 8:05 AM IST
#IndependenceDay 2019 : మంచిర్యాలలో 83 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ...
83 అడుగుల పొడవైన జెండా
Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 8:05 AM IST
#IndependenceDay 2019 : తెలంగాణలోని... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 83 అడుగుల జాతీయ త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి MLA దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.
విద్యార్థి, యువతలో జాతీయ భావాలను, దేశభక్తినీ పెంపొందించేందుకు ఈ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టామని వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ అండ్ బెటర్ యూత్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ఓరగంటి రంజిత్ తెలిపారు. అందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.

83 అడుగుల పొడవైన జెండా
83 అడుగుల పొడవైన జెండా


ఈ కార్యక్రమంలో బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఉపాధ్యక్షుడు పెంటపర్తి తిరుపతి, టీఆర్ఎస్ నేత తలారి కుమార్, మాజీ కౌన్సిలర్ sk యూసఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి, ఉపాధ్యాయ సభ్యులు దుర్గం అనిల్, దేవేందర్, సాయి, రాజశేఖర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...