ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు కళాకారులు స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు.
ఈ సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భం అని పేర్కోన్నారు. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటుందని చెప్పారు. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాంటూ తన ప్రసంగం కొనసాగింది. ..
మరోవైపు సీఎం కేసిఆర్ రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర అభివృద్దిపై ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని అభివృద్ది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు సంక్షేమ ఫలాలను ఆయన వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. విద్యా,వైద్యంతోపాటు విద్యుత్ రంగం వ్యవసాయం ఐటి రంగాల్లో సాధించిన అభివృద్దిని ఎకరవు పెట్టారు. ఈ నేపథ్యంలోనే 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో సాధించింది ఏమిటీ ..ఇంకా సాధించాల్సింది ఏముందనేని ఒక్కసారి సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల్లో దేశం అనేక రంగాల్లో వృద్ది సాధించినా చాలా రాష్ట్రాల్లో కనీస అవసరాలు కూడా పొందలేని దుస్థితి ఉందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.