Home /News /telangana /

INCREASED JOB OPPORTUNITIES FOR THE YOUTH OF MAHBUBNAGAR DISTRICT DUE TO ONLINE BUSINESS ENTERPRISES SNR MBNR

Telangana | Jobs : ఆ రెండు ఉంటే అక్కడ జాబ్ గ్యారెంటీ .. నెలకు 25నుంచి 30 వేలు జీతం

ONLINE JOBS

ONLINE JOBS

Telangana | Jobs: నిన్నటి దాకా నగరాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఇప్పుడు జిల్లాలకు విస్తరించాయి. ఫలితంగా తెలంగాణలోని మారుమూల పట్టణాల్లో ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాలో వలసలు తగ్గి..సొంత ఊళ్లోనే హ్యాపీగా మంచి జీతాలు పొందుతున్నారు యువతి, యువకులు.

ఇంకా చదవండి ...
  (Syed Rafi, News18,Mahabubnagar)
  మెట్రో సిటీ(Metro Cityలు), నగరాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ బిజినెస్‌(Online business)...ఇప్పుడు నిదానంగా పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నాయి. ఫలితంగా ఒకప్పుడు ఉద్యోగాలు, ఉపాధి లేక వలస పోయిన జిల్లాలోని యువత..ఇప్పుడు సొంత రాష్ట్ర, ఉన్న జిల్లాలోనే దర్జాగా బ్రతుకుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahbubnagar)జిల్లాలో ఆన్లైన్ వ్యాపార సంస్థల ద్వారా స్థానికంగా డెలివరీ బాయ్స్‌(Delivery boys)కు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం డెలివరీ బాయ్స్‌గా చేస్తున్న వారిలో 85శాతం యువతే ఉండటం ఇంకా విశేషం.

  Telangana Politics : బీజేపీ ఎంపీలంతా ఈసారి అసెంబ్లీ బరిలోకి .. కారును గట్టిగా ఢీకొట్టేందుకే మాస్టర్ ప్లాన్ ..!  ఆ రెండు ఉంటే చాలు..అక్కడ జాబ్ పక్కా
  ఎంత పని చేస్తే మంచి జీతం, ఇన్సెంటివ్ వస్తుంది. కేవలం టూ వీలర్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు మంచి జాబ్ దొరికినట్లే. అందుకే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని యువతకు గీక్ ఉద్యోగాలపై ఆసక్తి చూపించేలా ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు గాలం వేస్తున్నాయి. ఇంట్లో అవసరమయ్యే వస్తువులతో పాటు ఆహార పదార్థాలను కూడా ఆర్డర్ పై తెప్పించుకునే వారి సంఖ్య పెరగడంతో వినియోగదారులకు టైమ్‌కి వస్తువులు డోర్ డెలవరీ చేసేందుకు బాయ్స్‌ కొరత ఏర్పడింది.దాంతో ఒక్కసారిగా డెలవరీ బాయ్స్‌కు డిమాండ్ పెరిగింది. జిల్లాలో ఆన్ లైన్ బిజినెస్‌ సంస్థలు 64 ఉంటే 5వేల మంది పని చేస్తున్నారు. అందులో 20 నుంచి 30 ఏళ్ల లోపు వయసు  80% వరకు ఉన్నారు. రోజుకు ఓ ఉద్యోగి అందుతున్న కనీస వేతనంగా వెయ్యి రూపాయలు పొందుతున్నారు. ఆన్లైన్ వ్యాపార సంస్థల్లో గీగ్ ఉద్యోగులకు సొంత వాహనం తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే చాలు వారికి పాన్ కార్డు ఉంటే ఉద్యోగం వచ్చినట్లే.  ఆన్‌లైన్‌తో యువతకు ఉపాధి..
  నెలకు కనీసం 10 నుంచి 50 వేల వరకు సంపాధించే వాళ్లు ఉన్నారు. డెలివరీ బాయ్స్‌గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్లలో 50శాతం మంది పదవ తరగతి, ఇంటర్‌ పూర్తి చేసిన వాళ్లే ఉన్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇంకొందరు డెలవరీ బాయ్‌గా పనిచేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్‌గా నిలుస్తునే డిగ్రీ, వృత్తి విద్య కోర్సులు చేస్తున్నారు. ప్రతిరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 32 వేల ఆర్డర్లకు చెందిన వస్తువులు వస్తున్నాయని వాటి విలువ దాదాపు 80 లక్షలు ఉంటుందని నెలకు 24 కోట్ల వ్యాపారం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

  Crime News: 20వేల అప్పు కోసం .. క్లోజ్‌ ఫ్రెండ్‌పై ఆ విధంగా కసి తీర్చుకున్నాడు  కుటుంబాలకు అండగా...
  తెలంగాణలో నగరాలతో పోటీ పడుతూ జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ బిజినెస్ పెరగడం సంస్థలకు లాభదాయకంగా మారుతున్నాయి. మరోవైపు డెలివరీ బాయ్య్ కూడా ఉద్యోగాలు, ఉపాధి కోసం వలస వెళ్లకుండా ఉన్నచోటే మంచి ఉద్యోగం, గ్యారెంటీ జీతం పొందుతూ తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని చెబుతున్నారు. తక్కువ చదువులతో తాత్కాలిక ఉద్యోగాలు లభించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ లాంటి పేద, మధ్యతరగతికి చెందిన యువకులకు మంచి అవకాశమే అంటున్నారు మహబూబ్‌నగర్‌కి చెందిన మల్లికార్జున్. నెలకు 30 వేల వరకు ఆదాయం వస్తుందంటున్నాడు.

  ఇంతకు మించి ఏం కావాలి..
  మొహందాబాద్ గ్రామానికి చెందిన బాలరాజు ఇంటర్ పూర్తి చేసి కుటుంబానికి తన వంతు సహాయం చేయడానికి తాను ఆన్లైన్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. తాను కూడా ప్రతినెల 25 వేల వరకు సంపాదిస్తున్నానని చెబుతున్నాడు. ఈవిధంగా ఉన్నచోటే మంచి ఉద్యోగం లభించడంతో మరో అవకాశం వచ్చే వరకు ఇలాంటి ఉద్యోగాన్ని మారే ఆలోచన లేదంటున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahabubnagar, Online food delivery, Telangana News

  తదుపరి వార్తలు