Home /News /telangana /

INCREASED DEMAND FOR FISH IN ADILABAD DISTRICT DUE TO MONSOON SNR ADB

Adilabad : కిటకిటలాడుతున్న చేపల మార్కెట్‌లు .. మృగశిర కార్తె ఎఫెక్ట్

మృగశిర కార్తె ఎఫెక్ట్

మృగశిర కార్తె ఎఫెక్ట్

Adilabad: వర్షాకాలం ఆరంభం ముందు వచ్చే మృగశిర కార్తెకు చేపకూర తినడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. అదే పద్దతిని ప్రజలు పాటిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా మృగశిర కార్తె కారణంగా చేపలకు భారీగా డిమాండ్ పెరిగింది. ధరలు పెంచినా జనం ఎగబడి కొనుక్కెళ్తున్నారు.

ఇంకా చదవండి ...
  (K.Lenin,News18,Adilabad)
  మృగశిర కార్తె వచ్చిందంటే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది చేపలు. ఎండలతో ముచ్చెమటలు పట్టించిన రోహిణి కార్తె ముగిసి, వాతావరణాన్ని కొంత చల్లబరిచే మృగశిర కార్తె ప్రారంభమవుతుండటంతో చేపలకు ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా సీజన్ మారుతున్న ఈ సమయంలో చేపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి (Immunity)పెరగటమే కాకుండా, వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గించుకునే అవకాశం ఉందంటుంది. దాని కారణంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపల మార్కెట్(Fish market)లు కొనుగొలుదారులతో కిటికిటలాడిపోయాయి. అలాగే ఈసమయంలో మామిడ పండ్ల పానకం, చేపల కూర తినడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో ఈ ఆచారం ఇప్పటికి కొనసాగుతోంది. అటు రైతులు కూడా వానాకాలం సాగు పనులు మొదలుపెట్టారు.

  చేప కూర గుండె జబ్బుల మేలు..
  మృగశిర కార్తె సందర్భంగా చేపలకు బాగా గిరాకీ పలికింది. మంగళవారం నుంచే చేపల మార్కెట్‌లు జనంతో కిటకిటలాడిపోతున్నాయి. నగరాల్లో సంగతి పక్కన పెడితే చెరువు, జలాశయాలు ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా చేపలు పట్టుకోవడానికి చెరువుల దగ్గరే చేపలు కొనుగోలు చేయాల్సిన డిమాండ్ ఏర్పడింది. చేపల మార్కెట్‌ ఉన్నప్పటికి మృగశిర కార్తె డిమాండ్ కారణంగా రోడ్లకు ఇరువైపుల టెంట్లు వేసి మరీ మత్సకారులు చేపలను విక్రయించారు.  డిమాండ్‌ కారణంగా పెరిగిన ధరలు..
  చేపలకు ఈ సీజన్‌లో ఉండే డిమాండ్‌ని అడ్డుపెట్టుకొని మత్స్యకారులు ధరలు కూడా పెంచి అమ్ముతున్నారు. రెండ్రోజుల క్రితం వరకు కిలో కొరమీను చేప 500 రూపాయలకు విక్రయించారు. మంగళవారం నుంచి వాటి ధర వంద రూపాయలు పెంచి 600కు విక్రయిస్తున్నారు. బొచ్చె, రవ్వ చేపలు కిలో 150రూపాయలు ఉండగా వాటిని కూడ కిలో 220 రూపాయల నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు.
  సెంటిమెంట్‌ ప్రకారం ధరలు ఎంత పెంచినా మృగశిర కార్తెలో చేపలు తినాలనే సెంటిమెంట్‌ ఉండటంతో వెనుక ముందు చూడకుండా కొనుక్కొని వెళ్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో చేపల కోసం జనం ఎగబడిన దృశ్యాలు కనిపించారు.

  ఇది చదవండి: సిద్దిపేట జిల్లాలో ఎలక్ట్రిక్‌ బైకులోని బ్యాటరీ బ్లాస్ట్ ..బైకు, ఇల్లు రెండూ దగ్ధం  అన్నింటికి మంచిది..
  చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్తపోటు (బీపీ)ని నియంత్రిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలలో ఉండే డిహెచ్ఎ, ఈబీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. చేపలు గుండె సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి.గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Adilabad, Fish recipe, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు