హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mallareddy: మల్లారెడ్డి సంస్థల్లో రూ.135 కోట్ల అక్రమ లావాదేవీలు.. ఐటీ ఏం తేల్చిందంటే?

Mallareddy: మల్లారెడ్డి సంస్థల్లో రూ.135 కోట్ల అక్రమ లావాదేవీలు.. ఐటీ ఏం తేల్చిందంటే?

మంత్రి మల్లారెడ్డి (File Photo)

మంత్రి మల్లారెడ్డి (File Photo)

Mallareddy: ఐటీశాఖ సోదాలను మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రిని అయినందువల్లే తనపై దాడులు చేశారని అన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మంత్రి మల్లారెడ్డి (Minister Malla reddy) నివాసం, సంస్థల్లో ఐటీ సోదాలు (Income Tax Raids) తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. నవంబరు 22న మొదలైన ఆదాయ పన్ను శాఖ సోదాలు ఇవాళ మధ్యాహ్నం ముగిశాయి. మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్, మెడికల్, డెంటల్, ఫార్మసీ కాలేజీలు, ఆస్పత్రులు, స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించి మల్లారెడ్డి నివాసంతో పాటు కార్యాలయాలు, సీఈవోలు, డైరెక్టర్లు, మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు క్రాంతి బ్యాంకు ఛైర్మన్ ఇళ్లల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని ఆదాయ పన్ను శాఖ అధికారులతో పాటు ఒడిశా, కర్నాటక నుంచి కూడా అధికారులు వచ్చారు. 400 మందికి పైగా సిబ్బంది..65 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లతో పాటు నగదు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకొని.. వాటిని బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి తరలించారు. రెండున్నర రోజులుగా సాగిన సోదాలపై ఐటీ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు.

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..కేంద్రంపై కొట్లాటకు గులాబీ దళపతి సై

మల్లారెడ్డి వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. మల్లారెడ్డి విద్యాసంస్థలు సొసైటీ కింద నడుస్తున్నాయి. ఇక్కడ నిబంధనలకు పాతరేసి.. అక్రమ కార్యకలాపాలు నిర్వహించినట్లు ఐటీ అధికారుల సోదాల్లో తేలింది. మల్లారెడ్డికి చెందిన అన్ని కాలేజీల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే.. ఎక్కువ ఫీజు వసూలు చేసినట్లు ఆధారాలు లభించినట్లు పేర్కొంది. సోదాల్లో దాదాపు రూ.15 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. సోదాలు ముగియడంతో.. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఐటీశాఖ నోటీసులు జారీచేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో హాజరై.. వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

మరోవైపు ఐటీశాఖ సోదాలను మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రిని అయినందువల్లే తనపై దాడులు చేశారని అన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. రూ.100 కోట్ల అవకతవకలు జరిగాయన్నది అవాస్తవమని.. రెండున్నర రోజుల సోదాల్లో కేవలం రూ.28 లక్షలు మాత్రమే దొరికాయని తెలిపారు. వాటి లెక్కలను కూడా చూపించామని.. వారికి పూర్తిగా సహకరించామని స్పష్టం చేశారు. కానీ ఐటీ, సీఆర్‌పీఎఫ్ అధికారులు తమని దొంగల్లాగా చూశారని విమర్శలు గుప్పించారు.  మరోవైపు డీడీఐటీ రత్నాకర్‌ బలవంతంగా తన కుమారడి వద్ద సంతకం తీసుకున్నానరని మల్లారెడ్డి ఫిర్యాదు చేయడంపై దుమారం రేగుతోంది. ఈ వ్యవహారాన్ని ఐటీశాఖ సీరియస్‌గా తీసుకుంది

First published:

Tags: Hyderabad, Income tax, Mallareddy, Telangana

ఉత్తమ కథలు