Home /News /telangana /

IN THE NAME OF BHADRADRI DIVYAKSHETRA THUGS ARE CREATING A FAKE FACEBOOK ACCOUNT AND POSTING OBSCENE PORNOGRAPHIC VIDEOS KMM PRV

Fake accounts: రామ రామ.. భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో నకిలీ ఫేస్​బుక్​ అకౌంట్​.. అస్లీల చిత్రాలతో పోస్టులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీతారాములు కొలువైన పుణ్యక్షేత్రాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా 'భద్రాద్రి దివ్యక్షేత్రం (Bhadradri Divyakshetram)' పేరిట అకౌంట్‌ (Facebook account) సృష్టించి దారుణమైన అశ్లీల చిత్రాలను, వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (G. Srinivasreddy, News18, Khammam)

    శ్రీరాముడు. ఏకపత్నీవ్రతుడు. సీతాదేవి. మహాసాధ్వి. ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా నిలిచే సీతారాములు కొలువైన పుణ్యక్షేత్రాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా 'భద్రాద్రి దివ్యక్షేత్రం (Bhadradri Divyakshetram)' పేరిట అకౌంట్‌ (Facebook account) సృష్టించి దారుణమైన అశ్లీల చిత్రాలను, వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. వాస్తవానికి భద్రాద్రి ఆలయానికి (Bhadradri Temple) సంబంధించి ఎలాంటి అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా లేకపోయినా.. సోషల్‌మీడియాలో వ్యాప్తి ఎక్కువగా ఉండే ఫేస్‌బుక్‌ వేదికగా చేసుకుని సీతారాముల ఆదర్శాలకు గండి కొడుతున్నారు. గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై భద్రాద్రి వాసులు మండిపడుతున్నారు. సీతారాముల దివ్యక్షేత్రం పేరిట ఓ నకిలీ ఫేస్‌బుక్‌ పేజ్‌ ఏర్పాటు చేయడం.. దానిలో దారుణమైన అశ్లీల దృశ్యాలను పోస్ట్‌ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం (Bhadrachalam) స్థానికంగా ఉండే భక్తులు కొందరు ఈ విషయాన్ని ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

    అల్లర్లు సృష్టించడానికి..

    భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలా రామాలయం పేరు మీద ఫేస్‌బుక్‌లో టెంపుల్‌సిటీ పేరు మీద  నకిలి అకౌంట్ (Fake account) ను రూపొందించి .. అశ్లీల చిత్రాలను పోస్ట్ చేయడం వెనుక ఏదో కుట్రపూరితంగా అల్లర్లు సృష్టించడానికి (To create riots) కొంతమంది చేస్తున్న పన్నాగంగా ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘ విద్రోహశక్తులను శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అసభ్యకరమైన ఫొటోలను అప్ లోడ్ చేసిన  వారిపై సమగ్రమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



    ఆలయ అధికారులు ఏమంటున్నారు?

    పవిత్ర పుణ్యక్షేత్రాల మీద ఆస్లీల చిత్రాలను పోస్ట్ చేసే వారిని విడిచిపెట్టరాదని, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కావాలని కొందరు పథకం ప్రకారం చేస్తున్నారా లేక ఆకతాయిల పనా లేక ప్రశాంతంగా ఉన్న భద్రాచలం దివ్య క్షేత్రంలో  అల్లర్లు  సృష్టించే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా అనే దిశగా పోలీసులు విచారణ జరిపించాలని భక్త్తులు (Devotes) కోరుతున్నారు. భద్రాచలం (Bhadrachalam) టెంపుల్ సిటి భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం పేరు మీద ఎలాంటి FB అకౌంట్ లేదని .. ఆ అకౌంట్ హ్యాక్ అవ్వడం జరగలేదని ఆలయ అధికారులు అంటున్నారు.

    కఠిన చర్యలు తీసుకోవాలని..

    అయితే దీనిపై భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, సీతారాముల ఔన్నత్యాన్ని, భద్రాద్రి దివ్యక్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాచలానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కోన ఆనంద్‌కుమార్‌శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నెం.133\2022గా కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Facebook, Fake accounts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు