Home /News /telangana /

IN THE JOINT ADILABAD DISTRICT IF IT IS COLD ON ONE SIDE IT WILL BE HOT ON THE OTHER SIDE ADB VB

Cold and Hot: అక్కడ భిన్న వాతావరణం.. ఓ వైపు చలి.. మరో వైపు చెమటలు.. అయోమయంలో ప్రజలు..

ఆదిలాబాద్ పట్టణంలో పరిస్థితి

ఆదిలాబాద్ పట్టణంలో పరిస్థితి

Cold and Hot: చలి గిలిగింతలు పెడుతోంది… ఒకపక్క జిల్లాపై మంచు దుప్పటి కప్పి చలి చక్కిలి గిలి చేస్తూంటే… మరోపక్క ఉక్కపోత చమటలు పెట్టిస్తోంది… అటు మబ్బులు సూర్యుడితో దోబూచులాడుతున్నాయి. అప్పుడే సూర్యున్ని కమ్మేస్తున్నాయి.

    (K.Lenin,News18,Adilabad)

    చలి గిలిగింతలు పెడుతోంది… ఒకపక్క జిల్లాపై మంచు దుప్పటి కప్పి చలి చక్కిలి గిలి చేస్తూంటే… మరోపక్క ఉక్కపోత చమటలు పెట్టిస్తోంది… అటు మబ్బులు సూర్యుడితో దోబూచులాడుతున్నాయి. అప్పుడే సూర్యున్ని కమ్మేస్తున్నాయి. ఆవరించిన మేఘాలను తప్పించుకొని భయటకు వచ్చిన భానుడు భగభమంటున్నాడు. ఆ వెంటనె కొద్దిసేపటికి మేఘాలు వచ్చి సూర్యుడి కమ్మేయడంతో వాతావరణం చల్లబడి మబ్బుగా ఉంటోంది. వీటికి తోడు వరణుడు కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరించి వెళుతున్నాడు. అక్కడక్కడ చినుకులు పడుతుంటే ఇంకా వానా కాలం పోలేదేమో అన్న భావన కలిగిస్తోంది.

    Very Sad: చూడటానికి ఎంత బాగుందో చూడండి.. ఆ పని ఎలా చేయాలని అనిపించిందో అతడికి..


    మొత్తంమీద ఎండాకాలం, చలికాలం, వానాకాలం కలిసి ఒకేసారి వచ్చాయా అన్న భావన కలుగుతోంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితి ఇది. గత కొన్ని రోజులుగా జిల్లాలో వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో అన్ని కాలాలు అధికంగానే ప్రభావాన్ని చూపుతుంటాయి. వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు, ఎండాకాలంలో ఎక్కువగా ఎండలు మండిపోతుంటాయి. అలాగే చలి కాలంలోనూ కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈసారి కూడా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి ప్రభావం కూడా పెరుగుతోంది. మారుమూల పల్లెలను పొగమంచు కమ్మేస్తోంది.

    Lovers In RTC Bus: అతడికి 28 ఏళ్లు.. బాలికకు 14 ఏళ్లు.. ఆటోలో ప్రేమించుకున్నారు.. బస్సులో ఇలా చేశారు..


    పొద్దుటిపూట పొగమంచు కమ్మేయడంతోపాటు మంచు కూడా కురుస్తోంది. రాత్రిళ్ళు చలి నుండి ఉపశమనం కోసం చలి మంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తెల్లవార్లు పొగమంచుతో ప్రధాన రహదారులపై వాహనదారులు రాకపోకల సందర్భంగా ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని తలమడుగు మండలం కోసాయి, భీంపూర్ మండలం అర్లి(టి), బోథ్ మండలం గుర్రాల తండా, కన్గుట్ట గ్రామాలలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు చలి గాలులు కూడా వీస్తున్నాయి. మరోవైపు జిల్లాలో పలుచోట్ల వర్షపాతం కూడా నమోదవుతూ వస్తోంది. జిల్లాలో నెలకొన్న భిన్నమైన వాతావరణ పరిస్థితులు పంటల సాగుపైనే కాకుండా ప్రజల ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతోంది.

    Affair: పుట్టింటికి వెళ్లిన భార్య.. వెంటనే వస్తానని చెప్పి తిరిగి రాలేదు..; ముగ్గురు ప్రియులతో కలిసి..


    జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్న శనగ, గోధుమ పంటలకు మేలు చేస్తున్నా, పత్తి, మిరప, కంది పంటలపై చలి ప్రభావం చూపుతోంది. మరోవైపు ఉదయం వీధుల్లోకి వచ్చే మున్సిపల్ కార్మికులు, వ్యవసాయకూలీలు, పాల వ్యాపారులు చలితో ఇబ్బందిపడుతున్నారు. చలి ప్రభావంతో సీజనల్ వ్యాధులు ముసురుకునే అవకాశం కనిపిస్తోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్దులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా తుఫాను ప్రభావంతోనే జిల్లాలో ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Cold water, Hot

    తదుపరి వార్తలు