జీ. శ్రీనివాసరెడ్డి ఖమ్మం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లోని మావోయిస్టు ( maoist movement )ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ ప్రహార్ సైనిక్ అభియాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఇచ్చిన పిలుపు మేరకు పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గ్రీన్ హంట్ (Greenhunt ) పేరిట మావోయిస్టు పార్టీ ఉనికిని నిర్మూలించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు సోమవారం నాడు ఓ ప్రెస్ రిలీజ్ ద్వారా తమ కార్యాచరణను ప్రకటించారు.
మావోయిస్టు పార్టీ ( maoist movement )పొలిట్‌బ్యూరో సభ్యుడు కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర్లు వర్దంతిని పురస్కరించుకుని మావోయిస్టులు ఈ పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేస్తున్న వారు, సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసీ గూడేల్లోని ప్రజలు అందరూ ఈ పిలుపునకు స్పందించి ఆపరేషన్ ప్రహార్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహించాలని రెండు రోజుల క్రితం ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి జిల్లాల బాధ్యుడు ఆజాద్ ఓ అధికారిక ప్రకటన జారీ చేశారు.
దీంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ( maoist movement ) ఈ ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లోని పోలీసు స్టేషన్లు, బేస్‌క్యాంపులు, కూంబింగ్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడా ఎలాంటి ప్రదర్శనలు నిర్వహించే పరిస్థితి ఉండరాదన్న పట్టుదలతో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.వరుస ఎన్కౌంటర్లు.. కరోనా దెబ్బలు, అనారోగ్యంతో మరణాలు, వైద్యం కారణంగా లొంగుబాట్లు వల్ల గత ఏడాది కాలంగా మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలు తింటూ వస్తోంది.
ఈ మధ్యనే అగ్రనేత ఆర్కే సైతం అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా మావోయిస్టులకు దిశానిర్దేశం చేసి, ఉద్యమానికి నేతృత్వం వహించే అధినాయకత్వం కరవైంది. మరోవైపు పార్టీ ఆదేశాలను క్షేత్ర స్థాయిలో తూచ తప్పకుండా అమలు చేసే హిడ్మా లాంటి కమాండర్లు సైతం కరోనా బారిన పడి చురుగ్గా లేని పరిస్థితి ఉంది. దీనికితోడు గడ్చిరోలి జిల్లాలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్. ఇలా గుక్క తిప్పుకోలేని స్థాయిలో మావోయిస్టు ఉద్యమం నిస్తేజంగా ఉండిపోయింది.
ఇది చదవండి : కరీంనగర్ ఉద్యమ కోటకు బీటలు.. పెరుగుతున్న అసమ్మతి..
దీని ఫలితమే ఉద్యమానికి కొత్తగా దిశానిర్దేశం చేయడం, యాక్షన్ కమిటీలను( action committe) కొత్తగా రూపొందించడం, ప్రణాళికలను వేగవంతంగా అమలు చేసేలా టెక్నాలజీని జోడించడానికి అవసరమైన శిక్షణ కోసం తమ కీలక సభ్యులను ఈశాన్య రాష్ట్రాలకు రావాల్సిందిగా కేంద్ర నాయకత్వం పిలుపునిచ్చినట్టు పోలీసు నిఘా బృందాలకు ఉప్పందింది. దీంతో దండకారణ్యంలో ఇప్పటిదాకా నిఘా వర్గాలు, కూంబింగ్ బృందాలు సైతం వెళ్లలేని ప్రాంతమైన అబూజ్మడ్ను సైతం ఖాళీ చేయాలన్న కేంద్ర కమిటీ ఉత్తర్వులను క్షేత్రస్థాయి క్యాడర్ అమలు చేసే పనికి పూనుంది.
ఈ దశలో వరుస ఎదురు దెబ్బలు తగలడం, ఎక్కడికక్కడ ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతంలోనూ పోలీసులు పైచేయి సాధించడంతో మావోయిస్టు పార్టీ ఒకింత ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. ఫలితంగా తమకు ఇన్నాళ్లూ అన్ని విధాలా అండగా ఉన్న వర్గాల్లోని మద్దతును చేజార్చుకోకుండా ఉండే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. ఇన్నాళ్లూ తమకు పూర్తి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక మొదలు, రేషన్ పంపిణిని సైతం నిర్దేశించిన మావోయిస్టు పార్టీ క్రమంగా సన్నగిల్లుతున్న బలాన్ని, చేజారుతున్న పట్టును తట్టుకోలేకపోతోంది.
ఇది చదవండి : కేంద్రం స్పష్టత ఇచ్చింది.. రాజకీయాలు మాని.. కొనుగోలు చేయండి..
బేస్‌క్యాంపుల వ్యూహంతో ర్యాపిడ్‌గా ( rapid movement ) కదులుతూ మావోయస్టుల ఉనికి తెలియగానే స్పందిస్తూ ముందుకెళ్తున్న పోలీసు బలగాలను ఎదుర్కోవాలంటే మావోయిస్టులు మరింత పటిష్టమైన వ్యూహాలతో సిద్ధం ( maoist plans ) కావాల్సిన అవసరం ఉందన్న నిజాన్ని నేతలు గుర్తించినట్టు చెబుతున్నారు. దీనికోసమే ప్రజా బాహుళ్యంలో తమకు ఉన్న పలుకుబడిని, మద్దతును పోగొట్టుకోరాదన్న భావనతోనే ప్రతి సందర్భాన్ని ఉద్యమం కోసం లింక్ చేస్తూ పార్టీ పిలుపునిస్తోందని మావోయస్టు ఉద్యమం పట్ల పూర్తి అవగాహన ఉన్న ఓ పోలీసు ( police officials ) ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే ఆపరేషన్ ప్రహార్‌ను వ్యతిరేకిస్తూ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టాలన్న పిలుపు నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా తనిఖీలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.