హోమ్ /వార్తలు /తెలంగాణ /

కొమ్ములతో కుమ్మేశాయి.. గేదెల దాడిలో అడవి పంది చిత్తు.. ఆశ్చర్యానికి లోనవుతున్న స్థానికులు

కొమ్ములతో కుమ్మేశాయి.. గేదెల దాడిలో అడవి పంది చిత్తు.. ఆశ్చర్యానికి లోనవుతున్న స్థానికులు

గేదెల దాడిలో చిత్తైన అడవి పంది

గేదెల దాడిలో చిత్తైన అడవి పంది

సాధారణంగా అడ్డువచ్చిన వాళ్లపై విపరీతంగా దాడిచేసే అడవి పంది గేదెలు చేసిన ఆ ఆకస్మిక దాడి కి హతాశయురాలైంది. చుట్టూ గేదెల మంద ఉండటంతో దాని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక తీరులా అయింది.

 • News18
 • Last Updated :

  ఆదిలాబాద్ జిల్లాలో ఓ వింత చోటు చేసుకుంది. పంటలపై దాడి చేసి నాశనం చేయడమే కాకుండా అడ్డు వచ్చిన మనుషులపై కూడా దాడి చేసే అడవి పంది పై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై బర్రెల మంద దాడి చేసి మట్టికరిపించింది.  కొద్దిరోజులుగా పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల గురించి రైతులు ఆందోళన చెందుతుండా.. తాజాగా జరిగిన ఈ  ఘటన సంచలనం సృష్టిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల నాగపూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.

  వివరాలు కింది విధంగా ఉన్నాయి. తమకు తీవ్ర ఆపద వచ్చినప్పుడు తప్ప సాధారణంగా బర్రెలు ఒక్కసారిగా కలిసి కట్టుగా దాడికి పాల్పడవు. కానీ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్ నాగాపూర్ గ్రామ సమీపంలో మాత్రం ఆ అరుదైన దృశ్యం సాక్షాత్కారమైంది. గేదెలు అక్కడికి దగ్గరగా ఉన్న చేనులో గడ్డి మేస్తున్నాయి. అదే సమయంలో ఓ అడవి పంది అక్కడ ఉన్న మొక్కజొన్ని పంటను నాశనం చేస్తోంది. అది చూసిన ఆ గేదెల మంద సహించలేకపోయింది.

  ఒక్కసారిగా ఆ అడవి పందిపై కొమ్ములతో దాడి చేసి దాని నడుము విరిచేశాయి. కింద పడగొట్టి.. దానిని కొమ్ములతో కుమ్మేశాయి. సాధారణంగా అడ్డువచ్చిన వాళ్లపై విపరీతంగా దాడిచేసే అడవి పంది గేదెలు చేసిన ఆ ఆకస్మిక దాడి కి హతాశయురాలైంది. చుట్టూ గేదెల మంద ఉండటంతో దాని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక తీరులా అయింది. తనకు అడ్డువచ్చిన వారిపై మీద పడి రక్కుతూ వారి ప్రాణాలు తీసే అడవి పంది.. ఇలా గేదెల చేతిలో చిత్తు కావడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Adilabad, Attack, Telangana

  ఉత్తమ కథలు