హోమ్ /వార్తలు /తెలంగాణ /

RTC Bus Accident : ఏసి బస్సులో ఎగిసిన మంటలు.. ఒకే రోజు మూడు ఆర్టీసీ ప్రమాదాలు... ఇద్దరు మృతి..

RTC Bus Accident : ఏసి బస్సులో ఎగిసిన మంటలు.. ఒకే రోజు మూడు ఆర్టీసీ ప్రమాదాలు... ఇద్దరు మృతి..

ఆర్టీసీ బస్సులో ఎగిసిపడుతున్న మంటలు

ఆర్టీసీ బస్సులో ఎగిసిపడుతున్న మంటలు

RTC BUS : హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు మూడు ఆర్టీసి బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడగా.. ఓ బస్సు ఆగ్నికి ఆహుతి అయింది. కాగా రెండు రోజుల క్రితమే వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడి ప్రయాణికుటకు గాయాలు అయిన విషయం తెలిసిందే..

ఇంకా చదవండి ...

ఆర్టీసీని ఓవైపు పటిష్టం చేసే పనిలో ఉన్నతాధికారులు ఉండగా మరోవైపు కాలం చెల్లిన బస్సులతో పాటు అద్దె బస్సుల హై స్పీడుతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. దీంతో ప్రయాణికుల సురక్షిత ప్రయాణం మరియు భద్రతపై ఆందోళన మొదలైంది. ఇలా ఒకే రోజు మూడు ఆర్టీసీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. నేడు ఓ బస్సు డ్రైవర్ విధుల్లో ఉండగానే కడుపునోప్పితో ఇబ్బందిపడ్డాడు. అయితే నడిరోడ్డుపై చాకచక్యంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎంజీబీఎస్ నుండి వరంగల్ వైపు వెళ్తుండగా డ్రైవర్‌కు కడుపు నొప్పి వచ్చింది. అయినా ప్రయాణికులను తీసుకుని బయలు దేరాడు.. దీంతో అంబర్ ప్రాంతానికి చేరకునే సరికి కడుపునొప్పి ఎక్కువ అవడంతో సీటులోనే కుప్పకూలిపోయాడు. అయితే ఇదే సమయంలో ప్రయాణికులకు ఎలాంటీ ప్రమాదం జరగకుండా బస్సును పక్కకు పెట్టి సీట్లో కుప్పకూలిన పరిస్థితి కనిపించింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా డ్రైవర్ హుటాహుటిన తార్నాకలోని ఆర్టీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ శ్రీనివాస్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఇక మరోవైపు ఆదివారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండంలో ఆర్టీసీ బస్సు ఢి కొని ఇద్దరు అన్నదమ్ములు అక్కడిక్కడే మృతి చెందారు. బస్సు టూ వీలర్‌పై వెళుతున్న ఇద్దరు అన్నదమ్ములను ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

ఇక ఇదే రోజు సాయంత్రం ఖమ్మ జిల్లా వైరాలో భద్రాచలం వెళ్తున్న మరో ఆర్టీసీ గరుడ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి 20 మంది ప్రయాణికులతో బస్సు భద్రాచలం వెళ్తోంది. బస్సు వైరా వద్దకు రాగానే ఇంజిన్ నుంచి పొగలు రావటం ప్రారంభించాయి. ఈ విషయాన్ని స్థానికులు గమనించి డ్రైవర్​కు తెలిపారు. బస్సు ఆపి చూసేలోపే మంటలు చెలరేగాయి. డ్రైవర్​ అప్రమత్తమై.. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులను కిందికి దించేశారు. మంటలు ఎగిసిపడుతుండటంతో... ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు పెట్టారు.


ఇది చదవండి : ఆదిలాబాద్‌కు గవర్నర్ తమిళిసై .. బిర్సాముండా జయంతి వేడుకలకు హజరు


అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో.. తక్షణమే స్పందించి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. ప్రమాదాన్ని ముందే గ్రహించటంతో.. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా రెండు రోజుల క్రితమే వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డి నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని కల్కొడ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు 30 మంది ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

First published:

Tags: RTC buses, Tsrtc

ఉత్తమ కథలు