నగరంలోని ఓ ప్రముఖ సంస్థలో సంధ్య, యశ్వంత్(పేర్లు మార్చాం) ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఒకరినొకరు పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. త్వరలోనే వివాహం చేసుకుందామని కలలు కన్నారు. కుదిరినప్పుడల్లా షికార్లు చేశారు. ఇంతలోనే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమైందో ఏమోగానీ ప్రియురాలు సంధ్యకు తన ప్రియుడు యశ్వంత్ నుంచి కాల్స్, మేసెజ్‌లు రావడం పూర్తిగా నిలిచిపోయాయి. ఆమె నంబరును సైతం యశ్వంత్ బ్లాక్ లిస్టులో పెట్టాడు. అలా రోజులు గడుస్తుండడంతో సంధ్య ప్రియుడు మాటలు వినక అల్లాడిపోయింది. అతడి పలకరింపు కోసం వెంపర్లాడింది. ఇంతకీ తనను ఎందుకు దూరం పెట్టాడో తెలుసుకోవాలనే తలంపుతో ఏలాగోలా అడ్రస్ తెలుసుకుని సంధ్య తన ప్రియుడి ఇంటి బాట పట్టింది. తీరా ఇంటికి వెళ్లి చూశాక.. సంధ్యకు షాక్ కొట్టినంత పనయ్యింది. తనతోనే జీవితం అని బాసలు చేసిన ప్రియుడు మరో మహిళ ఒడిలో తలపెట్టుకుని టీవీ చూస్తున్న దృశ్యం ఆమె కంటపడింది.
ఆ మహిళ ఎవరో కాదు తన ప్రియుడి భార్యగా తేలింది. ఒక్కసారిగా షాక్ నుంచి తెరుకుని యశ్వంత్‌ను నిలదీసింది. యశ్వంత్ భార్య సైతం ఇదేంటంటూ ప్రశ్నించింది. దీంతో వారికి సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ రోడ్డుపై పరుగులు తీశాడు. దీంతో ఆ మహిళలిద్దరూ పోలీసులకు సమాచారం చేరవేడయంతో వారు వచ్చి యశ్వంత్‌ను కాపాడి సమస్యను సద్ధుమణిగించారు. ఇది ఒక్క యశ్వంత్, సంధ్యల పరిస్థితే కాదు. ఇలాంటి వారు నగరంలో లాక్డౌన్ కాలంలో ఎంతోమంది బయటపడ్డారు. దొంగ ప్రియుళ్లు, భార్యలకు తెలియకుండా వేరే కాపురం, భర్తకు తెలియకుండా అక్రమా సంబంధాలు నెరుపుతున్న ఎన్నో ఉదంతాలు లాక్డౌన్ పుణ్యమాంటూ వెలుగులోకి వస్తున్నాయి.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.