warangal : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు జైలు శిక్ష...

Dasyam-Vinay-Bhaskar

warangal : ప్రభుత్వ చీఫ్‌ విప్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాంపల్లి స్పెషల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్‌ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది.

  • Share this:
    తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక మందిపై రైల్వే డిపార్ట్‌మెంట్ పలు కేసులను బుక్ చేసింది..ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కొంతమందిపై నాయకులు కార్యకర్తలపై కేసులు విచారణలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కాజిపేట్ రైల్వే స్టేషన్‌లో రైల్ రోకో నిర్వహించారు. దీంతో ఆయనతోపాటు మరో పద్దెనిమిది మందిపై రైల్వే పోలీసులు కేసును బుక్ చేశారు.

    ఇక అప్పటి నుండి కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు తుది తీర్పును రైల్వే కోర్టు వెలువరించింది. రైల్ రోకోకు సంబంధించిన సాక్ష్యాలు ఉండడంతో వినయ్ భాస్కర్‌కు జైలు శిక్షను విధించింది..శిక్షతోపాటు మరో 18మందికి మూడు వేల రూపాయలన జరిమాన కూడా విదించింది.అయితే శిక్షతో పాటు బెయిల్ కూడా అవకాశం ఇవ్వడంతో బెయిల్ అప్లై చేసుకున్నట్టు సమాచారం.

    కాగా ఇదే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ కవితకు కూడా ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష విధించింది.ఆమె ఎన్నికల్లో ఖర్చుపై వివరాలు తెలపకపోవడంతో కేసును విచారించిన అనంతరం జైలు శిక్ష విదించింది అనంతరం 10 వేల రూపాయల పూచికత్తుపై బెయిల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆదే జిల్లాకు చెందిన మరోరాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్ పై కూడా ఆదాయపు పన్ను చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో విచారించిన కోర్టు ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది..
    Published by:yveerash yveerash
    First published: