Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక.. ఆ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad: హైదరాబాద్ మహానగర ప్రజలకు అధికారులు కీలక సూచన చేశారు. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: October 28, 2020, 5:22 PM IST
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక.. ఆ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ మహానగర ప్రజలకు అధికారులు కీలక సూచన చేశారు. పలు ప్రాంతాల్లో ఈ నెల 31న నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2, 1400ఎంఎం మెయిన్ రింగ్ -1 పైపు లైనుకు జంక్ష‌న్ ప‌నులు చేప‌తున్నారు. దీంతో అక్టోబర్ 31 శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు నవంబర్ 1, ఆదివారం ఉదయం 6గంటల వరకు ఈ మరమ్మతు ప్రక్రియ కొనసాగనుంది. ఈ కారణంతో 24 గంటలు పాటు ఆయా ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

ఆ ప్రాంతాలివే..

మెహదీపట్నం, కార్వాన్, లాంగర్ హౌస్, కాకతీయ నగర్, హుమాయన్ నగర్, తల్లాగడ్డ, ఆసిఫ్ నగర్, ఎంఇఎస్, షేక్‌పేట్, ఓయు కాలనీ, టోలిచౌకి, మల్లెపల్లి, విజయ్ నగర్ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్ హిల్స్, సచివాలయం, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అల్లాబండా, గగన్ మహల్, హిమయత్ నగర్, బుద్వెల్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడి, అత్తాపూర్, చింతల్‌మెట్, కిషన్‌బాగ్, గంధంగూడ, కిష్మత్ పూర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కులుగుతుందని అధికారులు ప్రకటించారు. ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Published by: Nikhil Kumar S
First published: October 28, 2020, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading