హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారా.? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Hyderabad: సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారా.? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రామీణ ప్రాంతాల నుంచి, వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్లు, దసరాకో, సంక్రాంతికో సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకుంటుంటారు. తెలంగాణ వాసులయితే ఎక్కువగా దసరాను, ఆంధ్రా ప్రాంతం వాసులయితే సంక్రాంతిని ఎక్కువగా ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే అలా ఈ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలని ఫిక్సయి, ప్రయాణాన్ని ఖరారు చేసుకున్న వారికి హైదరాబాద్ పోలీసు శాఖ ఓ ముఖ్య గమనికను చేసింది.

ఇంకా చదవండి ...

  హైదరాబాద్‌లో ఏపీ వాసులే ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనిపిస్తాయి. మొన్నటిదాకా ట్రాఫిక్‌తో నానా కష్టాలు పడిన నగరవాసులు, సంక్రాంతి పండుగ సమయంలో ఏమాత్రం ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ ఫ్రీ సిటీలో విహరిస్తుంటారు. ఏపీ వాసులే కాదు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి జీవనం సాగిస్తున్నారు. అలా గ్రామీణ ప్రాంతాల నుంచి, వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్లు, దసరాకో, సంక్రాంతికో సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకుంటుంటారు. తెలంగాణ వాసులయితే ఎక్కువగా దసరాను, ఆంధ్రా ప్రాంతం వాసులయితే సంక్రాంతిని ఎక్కువగా ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే అలా ఈ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలని ఫిక్సయి, ప్రయాణాన్ని ఖరారు చేసుకున్న వారికి హైదరాబాద్ పోలీసు శాఖ ఓ ముఖ్య గమనికను చేసింది.

  హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలతోపాటు, చోరీలు సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగిపోతోంది. తాళం వేసి ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఎవరూ లేనిది చూసి, ఇంట్లోకి చొరబడి, డబ్బు, నగలతో ఉడాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు పెద్ద సంఖ్యలో జనాలు ఊళ్లకు వెళ్తుండటం నేరగాళ్లకు ఓ అవకాశంలా మారుతోంది. దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది వంటి పెద్ద పండుగలు పూర్తయిన తర్వాత, హైదరాబాద్‌లోని ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ‘పండుగకు ఊరు వెళ్లాం. తిరగొచ్చేసరికి ఇంట్లో డబ్బు, నగలు మాయం అయ్యాయి. మా ఇంట్లో దొంగలు పడ్డారు’ అని బాధితులు పోలీసుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారికి హైదరాబాద్ పోలీసులు ఓ సందేశం పంపించారు.

  ‘సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారు, స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. అలా చేస్తే రోజులో రెండుమూడు సార్లు పెట్రోలింగ్ సిబ్బంది అటుగా తనిఖీలకు వెళ్తారు. అలాగే ఇళ్లల్లో పెద్ద మొత్తంలో డబ్బు, నగలను పెట్టుకోవద్దు. ఇంటికి తాళం వేస్తున్నాం కదా అని ధైర్యంతో ఉండొద్దు. పెద్ద మొత్తంలో డబ్బు, నగలు ఉంటే దాన్ని బ్యాంకుల్లో లాకర్లలో పెట్టుకోండి. అలాగే ఎవరైనా మీ వీధుల్లో అనుమానాస్పదంగా కనిపనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి’ అని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్‌‌స్పెక్టర్ కందిమళ్ల నాగయ్య ‘నేనేసైతం’ కార్యక్రమంలో భాగంగా ప్రేమ్‌నగర్ ఇంజనీర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఠఖ్యలు చేశారు. అపార్ట్‌మెంట్ వాసులు మరింత జాగ్రత్తగా ఉండాలనీ, ప్రతీ అపార్ట్‌మెంట్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Hyderabad, Sankranti 2021

  ఉత్తమ కథలు