Rain Alert: తెలంగాణలో వానలే వానలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ప్రతీకాత్మక చిత్రం

మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో.. కృష్ణా, గోదావరి నదులకు వరద పొటెత్తే అవకాశముంది.

  • Share this:
    తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో పాటు తెలంగాణలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. అల్పపీడన ప్రభావంతో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీమ్, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్ రూరల్‌, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు పడవచ్చని హెచ్చరించింది.

    సోమవారం రాత్రి జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 184.3, జగిత్యాలలో 175.5 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 118.5 మి.మీ, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లిలో 100 మి.మీ వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు మళ్లీ జలకళ సంతరించుకుంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండు కుండల్లా మారుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను పూర్తి స్థాయిలో తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో.. కృష్ణా, గోదావరి నదులకు వరద పొటెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: