Home /News /telangana /

rain alert : రాబోయే 3 రోజులూ వర్షాలు కురుస్తాయన్న IMD -ఏపీలో ఇప్పటికే జలప్రళయం

rain alert : రాబోయే 3 రోజులూ వర్షాలు కురుస్తాయన్న IMD -ఏపీలో ఇప్పటికే జలప్రళయం

హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ నాగరత్న

హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ నాగరత్న

ఏపీలో జలప్రళయం కొనసాగుతుండగా,  తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో దీని ప్రభావం తీవ్రంగా ఉండటంతో నవంబర్ నెలలో కనీ వినీ ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సహా రాయలసీమ జిల్లాలో భారీ వర్షం విలయాన్ని సృష్టించింది. అనంత‌పురం జిల్లాలోని క‌దిరిలో వరద ఉధృతికి నిర్మాణంలో ఉన్న భవంతి కూలి పక్కనే ఉన్న ఇంటిపై పడి రెండూ కుప్పకూలడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు పిల్లలున్నారు. చెయ్యేరు వరదలో కొట్టుకుపోయి 16 మంది గల్లంతు అయ్యారు. చిత్తూరు జిల్లా పూర్తిగా జలమయం అయిపోయింది. వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ (CM Jagan) ఏరియల్ సర్వే చేపట్టి, సహాయ కార్యక్రమాలపై జిల్లా అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఇక తెలంగాణలో..

ఏపీలో జలప్రళయం కొనసాగుతుండగా,  తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. కోస్తాంధ్రా మీదుగా ఒడిశా వరకు ఉన్న ఉపరతల ధ్రోణి ఇవాళ్టికి బలహీనపడ్డాయని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. తెలంగాణలోకి కింది స్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిక్కుల నుంచి వీస్తున్నట్లు ఆమె చెప్పారు.

Hyderabad : అమ్మమ్మతో అక్రమ సంబంధం.. 11 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం -80ఏళ్ల వృద్దుడి అఘాయిత్యం


ఏపీలో భారీ వర్షాలు దంచుతూ, జిల్లాల్లో జల విలయం కొసాగుతుండగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ శనివారం పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది. నాంపల్లి, బషీర్ బాగ్, బేగంబజార్, కోటి, అబిడ్స్, హిమాయత్ నగర్, లిబర్టీ, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురవగా పనులపై బయటికొచ్చిన ప్రజలు ఇబ్బందుల పడ్డారు. రాబోయే మూడు రోజులు వర్షాలు పడుతాయన్న హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.
Published by:Madhu Kota
First published:

Tags: Imd hyderabad, Rains, Telangana rains

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు