తెలంగాణకు వర్ష సూచన.. మూడు రోజుల పాటు వానలు

విధర్భ నుండి రాయలసీమ వరకు 1.5 కి.మీ. ఎత్తు నుంచి 2.1 కి.మీ. మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పటు వర్షాలు కురుస్తాయని చెప్పారు.

news18-telugu
Updated: March 6, 2020, 5:15 PM IST
తెలంగాణకు వర్ష సూచన.. మూడు రోజుల పాటు వానలు
ఈస్ట్ చంపారన్ (5), సివాన్ (6), దర్భంగా (5), బాకా (5), భగల్ పూర్ (6), ఖగారియా (3), ముధుబని (8), వెస్ట్ చంపారన్ (2), సమస్తిపూర్ (1), షాపోర్ (1), కిషన్ గంజ్ 92), సారన్ (1), జహనాబాద్ (2), సీతామర్హి (1), జుమై (2), నవాడా (8), పూర్ణై (2), ఔరంగాబాద్ (3), బుక్సర్ (2), కైమూర్ జిల్లాలో (1) చనిపోయారు.
  • Share this:
ఎండాకాలంలో తెలంగాణ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. విధర్భ నుండి రాయలసీమ వరకు 1.5 కి.మీ. ఎత్తు నుంచి 2.1 కి.మీ. మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ, రేపు నల్గొండ, యాదాద్రి-భువనగిరి,సూర్యాపేట, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందదని తెలిపారు. ఆదివారం కూడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Published by: Shiva Kumar Addula
First published: March 6, 2020, 5:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading