Telangana Rains: ఆ జిల్లాలకు భారీ, అతి భారీ వర్ష సూచన...అధికార యంత్రాంగం హై అలర్ట్

Telangana Heavy rains: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్, కరీంనగర్ , నిజామాబాద్ , వరంగల్ , ఖమ్మం జిల్లాలలో భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది.

news18-telugu
Updated: September 20, 2020, 7:14 PM IST
Telangana Rains: ఆ జిల్లాలకు భారీ, అతి భారీ వర్ష సూచన...అధికార యంత్రాంగం హై అలర్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్, కరీంనగర్ , నిజామాబాద్ , వరంగల్ , ఖమ్మం జిల్లాలలో భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్, కరీంనగర్ , నిజామాబాద్ , వరంగల్ , ఖమ్మం జిల్లాలలో భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల వలన వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉంది. వర్షాల వలన వరదలు సంభవించడం తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, పడిపోవడం వలన సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుంది, రిజర్వయర్లు , చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వలన లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు , కాజివేలలో నీరు ప్రవహించే అవకాశం ఉంది. ట్రాఫిక్ అంతరాయలు, ప్రజలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. జిల్లా యంత్రంగం మొత్తం అప్రమత్తంగా ఉండి . ఇంతకు ముందే జారీ చేసిన Flood Protocol తప్పని సరిగా ఫాలో కావాలని జిల్లా కలెక్టర్లను  కోరినట్లు రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు ఈ విషయంమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  తో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను, ఎస్.పి.లను అప్రమత్తంగా ఉండాలని పరిస్థితులను ఎప్పడికప్పుడు గమనించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

telangana heavy rains, telangana weather report, telangana rains today, telangana forecast today, telangana weather forcast, imd forecast today, telangana rains news, తెలంగాణలో భారీ వర్షాలు, ఐఎండీ వాతావరణ హెచ్చరిక, తెలంగాణ వార్తలు
ఐఎండీ హైదరాాబాద్ కేంద్రం విడుదల చేసిన తాజా ప్రకటన


తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ ఐఎండీ హైదరాాబాద్ కేంద్రం విడుదల చేసిన తాజా ప్రకటన.
Published by: Janardhan V
First published: September 20, 2020, 7:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading