హైదరాబాద్, ఈ 9 జిల్లాలకు హెచ్చరిక.. మూడు రోజులు వడగాల్పులు..

ఈనెల 16,17,18 తేదీల్లో హైదరాబాద్‌లో వడగాల్పులు వీసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఎండలు మండిపోయే అవకాశం ఉంది.

news18-telugu
Updated: May 15, 2019, 5:43 PM IST
హైదరాబాద్, ఈ 9 జిల్లాలకు హెచ్చరిక.. మూడు రోజులు వడగాల్పులు..
మండిపోతున్న ఎండలు
news18-telugu
Updated: May 15, 2019, 5:43 PM IST
హైదరాబాదీలకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది. కాబట్టి, రాజధానివాసులు అప్రమత్తంగా ఉండాలి. ఈనెల 16,17,18 తేదీల్లో హైదరాబాద్‌లో వడగాల్పులు వీసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఎండలు మండిపోయే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల టెంపరేచర్ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశ నుంచి వడగాలులు వీస్తున్నందున ఆ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. మంగళవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ (43.3), మెదక్, నల్లగొండ (43.2), రామగుండం 42.2, హైదరాబాద్ 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...