సూసైడ్ చేసుకుంటున్నా.. టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సెల్ఫీ వీడియో

నరేష్ భార్య కోమలి ప్రస్తుతం టీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందారు.

news18-telugu
Updated: February 20, 2020, 8:35 PM IST
సూసైడ్ చేసుకుంటున్నా.. టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సెల్ఫీ వీడియో
కోమల్ భర్త నరేష్
  • Share this:
నిజామాబాద్‌లో సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ నిజామాబాద్ కార్పొరేటర్ కోమల్ భర్త నరేష్ కుమార్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఆకాశ్ అనే వ్యక్తి తనను టార్చర్ పెడుతున్నాడని.. తన భార్యను అతడి భార్యగా చెప్పుకుంటు ఇబ్బంది పెడుతున్నాడని పేర్కొన్నాడు. చంపేస్తానని పదేపదే బెదిరిస్తున్నాడని.. అతడి వేధింపులను భరించలేక తాను చనిపోతున్నానంటూ వీడియోలో చెప్పాడు. నా జీవితం ఇంతటితో ముగుస్తోందని కుటుంబ సభ్యులకు వీడియో పంపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సంచలన రేపుతోంది.
ఆకాశ్ నన్ను వేధిస్తున్నాడు. బతకనీయడం లేదు. చంపేస్తానంటూ హెచ్చరిస్తున్నాడు. నువ్వెంత నీ బతుకెంత అంటూ నిత్యం బెదిరిస్తున్నాడు. నీ భార్యను తీసుకెళ్తానంటూ టార్చర్ పెడుతున్నాడు. ఆకాశ్ గురించి ఎవరికీ చెప్పినా పట్టించుకోలేదు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నా. నా జీవితం ఇంతటితో ముగుస్తుంది.
సెల్ఫీ వీడియోలో నరేష్


నరేష్ భార్య కోమలి ప్రస్తుతం టీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందారు. కాగా, నరేష్ సెల్ఫీ వీడియో గురించి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ కోసం గాలిస్తున్నారు. ఇక వీడియోపై టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత జరుగుతున్నట్లు తెలుస్తోంది.
First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు