హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gadwala : నేతలే సూత్రధారులు ! అక్రమ మద్యం తరలింపుతో దందాలు

Gadwala : నేతలే సూత్రధారులు ! అక్రమ మద్యం తరలింపుతో దందాలు

నేతలే సూత్రధారులు !
 అక్రమ మద్యం తరలింపుతో దందాలు

నేతలే సూత్రధారులు ! అక్రమ మద్యం తరలింపుతో దందాలు

Gadwala : జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు దాటి మద్యం అక్రమంగా ఏపీకి తరలుతోంది. తెలంగాణ, కర్ణాటక కు చెందిన మద్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతుంది. అయితే ఈ అక్రమ రవాణాలో ప్రధాన పార్టీకి చెందిన నేతలు ఉండడంతో ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.ఇక తనిఖీలు చేయాల్సిన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో వీరికి కార్యకలాపాలకు అదుపు లేకుండా పోతుంది.

ఇంకా చదవండి ...

న్యూస్ 18 మహబూబ్ నగర్...

సయ్యద్ రఫీ..

జోగులాంబ గద్వాల జిల్లాకు అనుకొని ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక సరిహద్దులున్నాయి. జిల్లా పరిధిలోని కేటి దొడ్డి ధరూర్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి, అలంపూర్ చౌరస్తా, ఉండవల్లి, మానవపాడు మండలాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు మద్యం అక్రమంగా తరలి పోతుంది. ముఖ్యంగా అక్రమ మద్యం వెనక జిల్లాలోని ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా మద్యం పట్టుబడితే పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పించుకుంటున్నారు.ఇలా ప్రతి నెల రూ.కోట్లలో మద్యం తరలిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పట్టుకున్న లెక్కలే చెబుతున్నాయి.

జిల్లా నేతలే కీలకం

మద్యం తరలింపులో జిల్లాకు చెందిన ప్రధాన పార్టీ నేత పేర్లు వినిపిస్తున్నాయి. ధరూర్ లో పట్టుబడిన మద్యంలో కేటి దొడ్డి మండలం కి చెందిన ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు కీలక సూత్రధారి అని తెలిసింది. మద్యం తరలింపు విషయం పోలీసులకు తెలిసినా ఆయనపై కనీసం కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గద్వాల నియోజకవర్గంలోని కేటి దొడ్డి ధరూర్ మండలాల మీదుగా తరచూ కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా సరఫరా అవుతుండడంతో పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఓ ముఖ్య ప్రజా ప్రతినిధి అనధికారిక పీఏ గా వ్యవహరిస్తున్న ఉద్యోగి జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం.

నేతల్లో మద్యం దందా

మరోవైపు అలంపూర్ నియోజకవర్గం నుంచి కొందరు ప్రధాన పార్టీ నేతలు ఈ దందా ను ఎంచుకున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఉండవల్లి అలంపూర్ కు చెందిన ఆ నేతలు రోజు ఆంధ్ర ప్రదేశ్ కి అక్రమంగా మద్యం తరలించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరు కర్ణాటక మద్యంతో పాటు జిల్లాలోని పలు వైన్ షాప్ లో నుంచి సేకరించి యథేచ్ఛగా లిక్కర్ లను ఏపీకి అక్రమంగా తరలిస్తున్నారు.

పోలీసుల్లో ను రెండు వర్గాలు..

జోగులాంబ గద్వాల జిల్లా లోని పోలీస్ శాఖ రెండు వర్గాలుగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ రెండు వర్గాలకు ప్రధాన పార్టీ నేతల మద్దతు ఉంది. ఓ నేతకు చెందిన మద్యాన్ని మరో వర్గం పోలీసులు పట్టుకుంటే కేసులు నమోదు చేస్తున్నారు. వారికి అనుకూలంగా ఉన్న నేతలు మద్యం అయితే వదిలి పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా రెండు వర్గాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలతో అప్పుడప్పుడు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే అక్రమ మద్యం వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. లేదంటే యధేచ్చగా సరిహద్దులు దాటి ఆంధ్ర ప్రదేశ్ కి తరులు తుంది..

సరిహద్దు మండలాల నుండి అక్రమ తరలింపు

కర్ణాటక నుండి మద్యాన్ని ట్రాక్టర్ లలో అక్రమంగా తరలిస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా లోని కొన్ని రోజుల ముందు ధరూర్ మండల తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ మధ్యాన్ని ఆంధ్ర ప్రదేశ్ కి తరలిస్తుండగా పోలీసుల కంట పడింది. ఈ వ్యవహారం వెనుక ప్రధాన పార్టీకి చెందిన నేత ఉండడంతో ఆరోజు రాత్రి కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టాలని పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి వచ్చింది.దీంతో ట్రాక్టర్ ను వదిలేద్దాం అనుకుని సమయంలో ఈ వ్యవహారం మీడియాకు తెలియడంతో తప్పనిసరిగా కేసు నమోదు చేయాల్సి వచ్చింది. కాని అసలు సూత్రధారిని మాత్రం పోలీసులు పట్టుకోలేదు..

సరిహద్దు చెక్‌పోస్టుల్లో కోట్ల రూపాయల అక్రమ మద్యం

ఇలా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్ ప్లాజా దాటాక పంచలింగాల వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఆర్నెల్లలో 23 586 బాటిల్ మద్యాన్ని పట్టుకున్నారు. ఈ మద్యం రాయచూర్ తో పాటు జోగులాంబ గద్వాల జిల్లా లోని పలు మద్యం దుకాణాలకు చెందిన లాట్ నెంబర్ల దాని తేలింది. పట్టుబడిన మద్యం విలువ రూ.కోట్లలో ఉంటుంది దీనికి సంబంధించిన 359 వాహనాలను సీజ్ చేశారు...

First published:

Tags: Liquor, Mahabubnagar

ఉత్తమ కథలు